
| Movie Name | Gandharwa |
|---|---|
| Director | Apsar |
| Star Cast | Sandeep Madhav, Gayatri R |
| Music | Raprock Shakeel |
| Singer(s) | Dhanunjay, Moushmi Neha |
| Lyricist | Apsar Hussain |
| Music Label | Aditya Music |
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే
పువ్వులనే నవ్వులనే
మించిన అందం నీదేలే
నీ నడిచే దారులలో
కాంతులు నీవేలే
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
కనులను దాటి… మనసుని తాకి
ఎదలను చేరే కదలవని
హో, నేనే నువ్వై… నువ్వే నేనై
మెడలను తాకే మూడులవనీ
తీరన్ని చేరే మన హృదయం
మాటల్లో పెరిగే మలి మౌనం
నాలోని ఊహలను… కదిలించే బంధమా
నీవెంటే నేనంటూ… సాగేటి రాగమా
కన్నులకే కానుకవే… చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే… అందెలలో సవ్వడివే
క్షణమే యుగమై… నాలో సగమై
మాటలు చాలని పలుకవని
అదిరే పెదవై… నిదురే కరువై
తనువుల తపనే… మొదలవనీ
చీకటిని చేరే… రవి కిరణం
ఊహల్లో దాగే… తొలి ఉదయం
వీచేటి గాలుల్లో… పిలిచేటి ప్రాణమా
నిన్ను చేరే తరుణంలో… వేచున్న నేస్తమా
కన్నులకే కానుకవే
చిన్ని గుండెకే ఊపిరివే
వెన్నెలకే వెలుతురివే
అందెలలో సవ్వడివే
Kannulake Kaanukave song is from the Gandharwa movie.
Kannulake Kaanukave song was sung by Dhanunjay, Moushmi Neha.
Kannulake Kaanukave song lyrics were written by Apsar Hussain.
Kannulake Kaanukave song music was composed by Raprock Shakeel.