
| Movie Name | Rebels Of Thupakulagudem |
|---|---|
| Director | Jaideep Vishnu |
| Star Cast | Praveen Kandela, Shrikant Rathod, Jaiyetri Makana |
| Music | Mani Sharma |
| Singer(s) | Sahithi Chaganti |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Saregama Telugu |
ఎర్రాని ఎండలల్లా యాడ తిరుగుతున్నవో
సల్లని సలికి వణికి యాడ వరిగినావో
జోరువాన తడపంగ ఏ సూరుకింద ఉన్నావో
నా పిలుపు సెవున పడక ఎంత దూరమున్నవో
కడుపుల నిను దాసుకుంట రా
నా కన్న కొడుక
నీ ఇంటికి తిరిగిరా బిడ్డా
ఏలకింత తిన్నవో కడుపు కాల్సుకున్నవో
దూపైతే నీళ్లు లేక గొంతు ఎండి ఉన్నవో
రోగమొస్తే నొప్పులొస్తే ఎట్ల తట్టుకున్నవో
అడ్డమైన మందితోటి మాటలెన్ని పడ్డవో
కండ్లార సూసుకుంట రా
నా కన్న కొడుక
నీ ఇంటికి తిరిగిరా బిడ్డా
కన్నఊరు మన్ను మరిసి
కట్టుబట్ట తోటి నడిసి
కానరాని రాజ్యమందు
కొలువు కొరకు పోతివో
సుట్టాలు దోస్తులిడిసి తోడబుట్టినోళ్లనిడిసి
ఒంటరైపోయి నువ్వు దిక్కు తోచకుంటివో
నోరారా పిలుసుకుంట రా
నా కన్న కొడుక
నీ ఇంటికి తిరిగిరా బిడ్డా
నువ్వు గెలిసి రాజువైన
ఓడిపోయి బంటువయినా
ఆటలోన ఓడిపోయినా
నా కంట్ల నీ కన్నా
ఎవడు ఎపుడు ఎక్కువ కాదు
ఇంటికి తిరిగిరా బిడ్డా
నువ్ ఇంటికి తిరిగిరా బిడ్డా
ఇంటికి తిరిగిరా బిడ్డా
ఇంటికి తిరిగిరా బిడ్డా
Intiki Thirigiraa Bidda song is from the Rebels Of Thupakulagudem movie.
Intiki Thirigiraa Bidda song was sung by Sahithi Chaganti.
Intiki Thirigiraa Bidda song lyrics were written by Kasarla Shyam.
Intiki Thirigiraa Bidda song music was composed by Mani Sharma.