
| Movie Name | Rebels Of Thupakulagudem |
|---|---|
| Director | Jaideep Vishnu |
| Star Cast | Praveen Kandela, Shrikant Rathod, Jaiyetri Makana |
| Music | Mani Sharma |
| Singer(s) | Dhanunjay |
| Lyricist | Jaideep Vishnu |
| Music Label | Saregama Telugu |
అడవిలోన ఆడపిల్లరా
ఒక్క సూపులోనె దిల్లు దోచెరా
పట్టపగలు చందమామరా
కళ్ళ ముందే ఉన్నా చూడకుంటిరా
ముద్దు ముద్దు మాటలతో
మంటలే రేపే
సురుకైన సూపులతో
ఉతికి ఆరబెట్టే
బంగారవంటి పిల్లనే చూసి
కాళ్ళు నేలకానుకుండెరా
పిచ్చి ప్రేమ… పిచ్చి ప్రేమ
జోరు వాన లెక్క నన్ను ముంచె ప్రేమా
చెప్పు రామ… నువ్వు చెప్పు రామ
అంటు తీనుమారు డప్పు గుండె కొట్టె మామ
సుట్టు సుట్టు తిప్పుకుందిరా
పిల్ల అసలు మాట సెప్పకుందిరా
సాటు మాటు సూడబట్టెరా
ముందుకెల్లితే మూతి తిప్పబట్టెరా
ఇష్టం అంతలోన దాచి
ఫోజులేవో కొట్టె
కొంచమైనా జాలి లేక
బదులు టెన్ టు ఫైవ్ చెప్పకుండె
అందాల బొమ్మే సూడపొమ్మంటే
ఊపిరంతా ఆగిపోయెరా
పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ
దాచినా ఎంతని దాగే ప్రేమా
ఒక్క మాట ఇంకా చెప్పవమ్మా
అంటూ తీన్ మార్ డప్పు గుండె కొట్టె మామ
అరె, దూరమంతా దగ్గరాయెరా
వెంట నడుస్తుంటే కొత్తగుండెరా
సూపులోన సూపు కలిపెరా
పిల్ల ఉన్నకాడ ఉండనీదురా
ముచ్చటైన మాటలతో
గంటలైనా గడిచిపోయే
కొంటె కొంటె నవ్వులతో
ప్రాణమేదో పుట్టుకొచ్చే
ఎంత కష్టమైనా పిల్ల పక్కనుంటే
చిటికెలోన మాయవాయెరా
పిచ్చి ప్రేమ… పిచ్చి ప్రేమ
జోరు వాన లెక్క నన్ను ముంచే ప్రేమా
ఎదురు సూపులే తీరెనంటూ
తీన్ మార్ డప్పు గుండె కొట్టె మామ
Adavilona Aadapilla song is from the Rebels Of Thupakulagudem movie.
Adavilona Aadapilla song was sung by Dhanunjay.
Adavilona Aadapilla song lyrics were written by Jaideep Vishnu.
Adavilona Aadapilla song music was composed by Mani Sharma.