
| Movie Name | Gorintaku (1979) |
|---|---|
| Director | Dasari Narayana Rao |
| Star Cast | Shobhan Babu, Savitri, Vakkalanka Padma |
| Music | KV Mahadevan |
| Singer(s) | Susheela |
| Lyricist | Devulapalli Krishna Sastry |
| Music Label |
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గా తొడిగింది
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గా తొడిగింది
ఎంచక్కా పండిన ఎర్రన్నిచుక్క
ఎంచక్కా పండిన ఎర్రన్నిచుక్క
చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష
కన్నె పేరంటాలికి కలకాలం రక్ష
గోరింట పూచింది… కొమ్మా లేకుండా
మురిపాల అరచేత… మొగ్గ తొడిగింది
మామిడీ చిగురెరుపు… మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన… మాణిక్యం ఎరుపు
మామిడీ చిగురెరుపు… మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన… మాణిక్యం ఎరుపు
సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు
సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తన వారిలోన
గోరింట పూచింది… కొమ్మా లేకుండా
మురిపాల అరచేత… మొగ్గ తొడిగింది
మందారంలా పూస్తే… మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
మందారంలా పూస్తే… మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగి వస్తాడు
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్ళు… కోపిష్టి కళ్ళు
పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్ళు… కోపిష్టి కళ్ళు
పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు
పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు
కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
Gorinta Poochindi Komma Lekunda song is from the Gorintaku movie.
Gorinta Poochindi Komma Lekunda song was sung by Susheela.
Gorinta Poochindi Komma Lekunda song lyrics were written by Devulapalli Krishna Sastry.
Gorinta Poochindi Komma Lekunda song music was composed by KV Mahadevan.