
| Movie Name | Gorintaku (1979) |
|---|---|
| Director | Dasari Narayana Rao |
| Star Cast | Shobhan Babu, Savitri, Vakkalanka Padma, Sujatha |
| Music | KV Mahadevan |
| Singer(s) | Susheela & S P Balasubramanyam |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
చెప్పనా..! సిగ్గు విడిచి చెప్పరానివీ
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి
చెప్పనా చెప్పనా… చెప్పనా
అడగనా..? నోరు తెరిచి అడగరానివి
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ
అడగనా అడగనా… అడగనా?
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివీ
చెప్పమనీ, చెప్పకుంటే ఒప్పననీ
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి, చెప్పనా?
అడగమనీ, అడగకుంటే జగడమనీ
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి, అడగనా?
అడుగు మరి? చెప్పు మరి
అడుగు మరి? చెప్పు మరి
చెప్పితే అల్లరి… అడిగితే తుంటరి
చెప్పనా, సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా, నోరు తెరిచి అడగరానివి
నిన్న రాత్రి వచ్చి… సన్న దీప మార్పి
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని
వీపుతట్టి రెచ్చగొట్టి… కలలాగ వెళిపోతే
పిల్ల గతి కన్నెపిల్ల గతి… ఏమిటో చెప్పనా
పగటి వేళ వచ్చి పరాచకలాడి
ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి
పెదవి చాపి పిచ్చి రేపి… ఇస్తానని ఊరిస్తే
ఇవ్వమనీ ఇచ్చి చూడమని… ముద్దులే అడగనా
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివీ
వద్దని, హద్దు దాట వద్దని
అన్న కొద్ది, ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా
నేననీ, వేరనేది లేదనీ అనీ అనీ ఆగమని
ఆపుతున్నదెందుకని అడగనా
అడుగు మరి.. చెప్పు మరి
అడుగు మరి… చెప్పు మరి
చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
అడగనా అడగనా అడగనా
చెప్పనా..! సిగ్గు విడిచి చెప్పరానివీ
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి
చెప్పనా చెప్పనా… చెప్పనా
అడగనా..? నోరు తెరిచి అడగరానివి
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ
అడగనా అడగనా… అడగనా?
చెప్పనా… అడగనా
చెప్పనా… అడగనా
Cheppana Siggu Vidichi song is from the Gorintaku movie.
Cheppana Siggu Vidichi song was sung by Susheela & S P Balasubramanyam.
Cheppana Siggu Vidichi song lyrics were written by Acharya Athreya.
Cheppana Siggu Vidichi song music was composed by KV Mahadevan.