
| Movie Name | Nuvve Kavali (2000) |
|---|---|
| Director | Vijaya Bhaskar |
| Star Cast | Tarun, Richa Pallod |
| Music | Koti |
| Singer(s) | Sriram Prabhu, Gopika Purnima |
| Lyricist | Trivikram Srinivas |
| Music Label |
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది… చెలీ ఇదేం అల్లరీ
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది… అరే ఇదేం గారడీ…
నేను కూడా నువ్వయానా… పేరు కైనా నేను లేనా…
దీని పేరేనా… ప్రేమ అనే ప్రియ భావనా…
ఓ… దీని పేరేనా… ప్రేమ అనే ప్రియ భావనా…
లాలా లాలాల లాలా లాలాల…
లాలా లాలాల లాలా లాలాల…
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది…
చెలీ ఇదేం అల్లరీ…
లల లాలా… ఆహా యెహే… లాలలా..
నిద్దుర తుంచే మల్లెల గాలి… వద్దకు వచ్చి తానెవరింది..
నువ్వే కాదా… చెప్పు ఆ పరిమళం…
వెన్నెల కన్నా చల్లగ ఉన్న… చిరునవ్వేదో తాకుతు ఉంది…
నీదే కదా… చెప్పు ఆ సంబరం…
కనుల ఎదుట నువు లేకున్నా… మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా… నువ్వు పిలిచినట్టనుకున్న…
ఇది హాయో… ఇది మాయో… నీకైనా తెలుసునా…
ఏమిటవుతుందో ఇలా… నా ఎద మాటునా…
ఓ… దీని పేరేన… ప్రేమ అనే ప్రియ భావనా…
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది…
చెలీ ఇదేం అల్లరీ…
కొండల నుంచి కిందికి దూకే… తుంటరి వాగు నాతో అంది…
నువ్వూ అలా వస్తూ ఉంటావనీ…
గుండెల నుంచి గుప్పున ఎగసే… ఊపిరి నీకో కబురంపింది…
చెలీ నీకై చూస్తూ ఉంటాననీ…
మనసు మునుపు ఎపుడూ ఇంతా… ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింతా… ఎవరి చలవ ఈ గిలిగింత…
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా… ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా..
ఓ… దీని పేరేనా ప్రేమ… అనే ప్రియ భావనా…
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది…
అరే ఇదేం గారడీ…
నేను కూడా నువ్వయానా… పేరు కైనా నేను లేనా…
దీని పేరేనా… ప్రేమ అనే ప్రియ భావనా…
ఓ… దీని పేరేనా… ప్రేమ అనే ప్రియ భావనా…
లాలా లాలాల లాలా లాలాల…
Ekkada Unna Pakkana Nuvve song is from the Nuvve Kavali movie.
Ekkada Unna Pakkana Nuvve song was sung by Sriram Prabhu, Gopika Purnima.
Ekkada Unna Pakkana Nuvve song lyrics were written by Trivikram Srinivas.
Ekkada Unna Pakkana Nuvve song music was composed by Koti.