| Movie Name | ( ) In & English |
|---|---|
| Director | N Shankar |
| Star Cast | Mohan Babu, Soundarya, Harikrishna |
| Music | Vandemataram Srinivas |
| Singer(s) | K J Yesudas, Chitra |
| Lyricist | Kalekuri Prasad |
| Music Label |
ఏయ్, భూమికి పచ్చాని రంగేసినట్టు, అమ్మలాలా
పంటచేలు పెరగాలి… ఓయమ్మలాలో అమ్మలాలా
ఆలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వలవలవల ఏడ్చుకుంటూ… వలసెల్లి పోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా
చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో
పంటలు చేతికోస్తే పండుగ చేద్దామురో
భూమికి పచ్చాని… భూమికి పచ్చాని
భూమికి పచ్చాని… రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి… ఓయమ్మలాలో అమ్మలాలా
జాతరమ్మ జాతరమ్మ… కూలిజనం జాతరో, అమ్మలాలా
ఎత్తూ పల్లాలనే చదును చేసే జాతారో, అమ్మలాలా
చేలుదున్ని చాళ్ళు దీర్సే బీద బిక్కి జాతారో అమ్మలాలా
ఎద్దు కొమ్ముల నడుమా ఎర్రపొద్దు పొడిచెరో
భూస్వామి గుండెలధర గుడిసలోళ్ల జాతర
భూమికి పచ్చాని… భూమికి పచ్చాని
భూమికి పచ్చాని… రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
చెమటజల్లు చిలకరిస్తే… నేల పులకరించురో, అమ్మలాలా
వానోస్తే భూతల్లి సీమంతామాడురో, అమ్మలాలా
తంగేళ్ళు గన్నేర్లు పసుపుకుంకుమిచ్చురో, అమ్మలాలా
పసుల మెడన చిరుగజ్జలు ఘల్లున మ్రోగేనో
గజ్జల మోతల్లో పల్లె పరవసించెనో
భూమికి పచ్చాని… భూమికి పచ్చాని
భూమికి పచ్చాని… రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి… ఓయమ్మలాలో అమ్మలాలా
ఎగువా పెన్నమ్మతల్లి ఎగిరెగిరి దుంకితే, అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే, అమ్మలాలా
చిత్రంగా చిత్రావతి చిందూలు ఆడితే, అమ్మలాలా
నేలతల్లి నీల్లాడి పసిడి పంటలిచ్చురో
నా సీమ తమ్ముల్లో వెలుగులు నిండేనురో
భూమికి పచ్చాని… భూమికి పచ్చాని
భూమికి పచ్చాని… రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి… ఓయమ్మలాలో అమ్మలాలా
Bhoomiki Pachani song is from the ( ) In & English movie.
Bhoomiki Pachani song was sung by K J Yesudas, Chitra.
Bhoomiki Pachani song lyrics were written by Kalekuri Prasad.
Bhoomiki Pachani song music was composed by Vandemataram Srinivas.