
| Movie Name | & English - Basha |
|---|---|
| Director | Suresh Krissna |
| Star Cast | Rajinikanth, Nagma |
| Music | Deva |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Vennelakanti |
| Music Label |
బాషా బాషా… బాషా బాషా
హే, బాషా చూడు బాషా చూడు
సింగం లాంటి నడక చూడు
వెంటవచ్చు సైన్యం చూడు
పలనాటి బాలచంద్రుడి
పౌరుషమే ఉంది చూడు
బొబ్బిలి పులిగ జబ్బ చరిచి
వచ్చే ఆ తెగువ చూడు
ధర్మ సంస్థాపనకై
యుగపురుషుడు వచ్చినాడురా
ఉహ హ హ
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
బాషా చూడు… బాషా చూడు
ఉక్కు వంటి గుండె చూడు
ఉప్పెనంటి మనిషి చూడు
రగులుతున్న అగ్ని నగం
పగల పొగల సెగలు చూడు
గూండాలకూ దాదాలకూ
బాషా సింహ స్వప్నం చూడు
న్యాయం కోసం దేవుడికైనా
ఎదురు తిరుగు… ధైర్యం చూడరా
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
హే, బాషా చూడు బాషా చూడు
బొంబాయినేలు రాజా చూడు
లోకంవెంట వచ్చెను చూడు
కాలం ఆగి చూసెను చూడు
నింగే వంగి మొక్కెను చూడు
చుక్కలంటే మేడలైనా
బాషాకే తలవంచెను చూడు
కోట్లైనా నోట్లైనా… బాషా ముందుకు
వచ్చెను చూడరా, ఆహ హ హ
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
ఈ బాషాకింక దేశంలోనే
ఎదురు లేదురా
Basha Chudu Basha Chudu song is from the & English - Basha movie.
Basha Chudu Basha Chudu song was sung by S P Balasubramanyam.
Basha Chudu Basha Chudu song lyrics were written by Vennelakanti.
Basha Chudu Basha Chudu song music was composed by Deva.