
| Movie Name | & English - Sampangi |
|---|---|
| Director | Saana Yadi Reddy |
| Star Cast | Deepak, Kanchi Kaul |
| Music | Ghantaadi Krishna |
| Singer(s) | Varikuppala Yadagiri |
| Lyricist | Varikuppala Yadagiri |
| Music Label | Aditya Music |
కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే
ఓపెనర్ జారిపోయే… వీడి గుండె ఓపెనైపోయే
మెట్లు దిగి ఫాలో చేసి… కింద చూడబోతే
అంతలోనే మాయమాయే..!
వాడి మనసు దాటి వెళ్ళిపోయే
అల్లంత దూరాన… చుక్కలాగా మెరువగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైలు గేటు దాటి వెళ్ళిపోయే
వీడి గుండె గిల్లి వెళ్ళిపోయే
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందో మరీ… నా ప్రియమైన ఆ సుందరీ
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
అనుకోకుండానే నేను చూశాను ఆమెనూ
ఆపే వీల్లేక ఆమెతో పాటు నా మనసునూ
అనుకోకుండానే నేను చూశాను ఆమెనూ
ఆపే వీల్లేక ఆమెతో పాటు నా మనసునూ
ఎక్కడని వెతకాలి… ఆ ప్రేమను
చూడకుండా ఉండలేను ఏం చెయ్యను
ఏమో… ఏ మేడల్లో దాగి ఉందోరా..?
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడీ
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడీ
ఒక్కసారి చేరాలి… ఆ నీడను
విన్నవించుకోవాలి ఈ బాధను
ప్రాణం… పోతున్నట్టుగా ఉందిరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందో మరీ
నా ప్రియమైన ఆ సుందరీ
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
Andamaina Kundanala Bomma song is from the & English - Sampangi movie.
Andamaina Kundanala Bomma song was sung by Varikuppala Yadagiri.
Andamaina Kundanala Bomma song lyrics were written by Varikuppala Yadagiri.
Andamaina Kundanala Bomma song music was composed by Ghantaadi Krishna.