
| Movie Name | Geetha (2022) |
|---|---|
| Director | Viswa(R)Rao |
| Star Cast | Hebba Patel, Gautham |
| Music | Subhash Anand |
| Singer(s) | Divya Malika |
| Lyricist | Sagar Narayana |
| Music Label | Tips Telugu |
అందాల చందమామ
ఇదిగోవే నీ చిరునామ
ఎదురొచ్చి చెయ్యే చాచి పిలిచనే
నీ కలలకు రంగులు పూసి
నీ లోకం తలుపులు తీసి
ఈ మమతల గూటికి నిన్నే చేర్చెనే
ఇన్నాళ్ళు ఎక్కడ ఉందో
వాసంతం టక్కున వచ్చి
నీ సొంతం కావాలంది ముద్దుగా
నడిచిరావే గడపదాటి మరిచి నీ గతమే
ఓ అందాల చందమామ
ఇదిగోవే నీ చిరునామ టెన్ టు ఫైవ్
ప్రియమారా చెయ్యే చాచి పిలిచనే
వెలుగు చూడని కోనలో
మెరుపు వానలు కురిసెనే
ఆశలెరుగని మనసులో
ప్రేమ మొలకలు వేసెనే
ఏకాకి నడకకు ఓ తోడు చేరి
సాగింది ఆగని గమనమే
కొండంత బాధను… నలుసంత చేసి
చిరునవ్వు పూసెను పెదవిపై
మోడైన కొమ్మలన్ని పచ్చని పూత పూసి
చేసాయి సంతోషాల వేడుకే
అలలు ఎరుగని సరసులో
కలలు సవ్వడి చేసెనే
మూగబోయిన తీగలో
మౌనరాగం పలికెనే
ఏ కంటిపాపో తాను నీ ఇంట దీపమెట్టి
అల్లింది అందమైన బంధమే
ఈ చిన్ని గూటిలో ఆ వెన్నెలమ్మగా
చుట్టూర వెలుగులు చిమ్మెనే
ఆ గువ్వ గోరువంక ఓ గూడు కట్టినట్టు
బాగుందే వీరి వింత కలయికే
Andaala Chandamama song is from the Geetha movie.
Andaala Chandamama song was sung by Divya Malika.
Andaala Chandamama song lyrics were written by Sagar Narayana.
Andaala Chandamama song music was composed by Subhash Anand.