
| Movie Name | Seetha Payanam (2026) |
|---|---|
| Director | Arjun |
| Star Cast | Niranjan, Aishwarya Arjun, Arjun, Action Prince Dhruva Sarja |
| Music | Anup Rubens |
| Singer(s) | Rahul Sipligunj, Madhu Priya |
| Lyricist | ChandraBose |
| Music Label | Saregama India Limited |
పాట పేరు: ఏ ఊరికెళ్తావే పిల్ల (Ye Oorikelthave Pilla)
గాయకులు: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), మధు ప్రియ (Madhu Priya)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
నటీనటులు: ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun), నిరంజన్ (Niranjan), అర్జున్ సర్జా (Arjun Sarja)
కథ – స్క్రీన్‌ప్లే – నిర్మాణం & దర్శకత్వం: అర్జున్ సర్జా (Arjun Sarja)
ఏ ఊరు కెల్తావే పిల్లా? నువ్వు ఏ ఊరు కెళ్తావే పిల్లా?
ఏ ఊరు కెల్తావే పిల్లా? నువ్వు ఏ ఊరు కెళ్తావే పిల్లా?
కాకినాడ కెళ్లకే కాకులెత్తుకెళ్తాయె
గుంటూరుకెళ్లకే గుంటలోన పడతవే
పిడుగురాళ్లకెళ్లకే పిడుగు మీద వడతదే
గాజువాక కెళ్లకే గాజు గుచ్చుకుంటదే..
ఓ కావలికెళ్లకే పిల్లా… ఓ…
ఏయ్ కావలికెళ్లకే పిల్లా నీకు కావాల్సిందుండాదే పిల్లా…
మా ఊరు రావే పిల్లా, నువ్వు మా ఊరు రావే పిల్లా…
ఏ ఊరుకెళ్తావే పిల్లా, నువ్వు ఏ ఊరు కెళ్తావే పిల్లోయ్
బెంగుళూరు కెళ్లకే బెంగవాడి పోతావే
మనాలి కెళ్లకే మనాళ్ళు ఉండరే
సింగపూర్ కెళ్లకే సింగలై పోతావే
మస్కట్టు కెళ్లకే బిస్కెట్లు ఇస్తారే
బ్యాంకాక్‌కు కెళ్లకే పిల్లా… ఓ.. ఓ
బ్యాంకాక్‌కు కెళ్లకే పిల్లా…
బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదే పిల్లా..
ఓయ్ మా ఊరు రావే పిల్లా, నువ్వు మా ఊరు రావే పిల్లా…
ఏ ఊరుకెళ్తావే పిల్లా, నువ్వు ఏ ఊరు కెళ్తావే పిల్లోయ్
యాహే మీ ఊళ్ళో ఏముందీ పిల్లడా?
అరే, మీ ఊళ్ళో ఏముందీ పిల్లడా…
ఆ ఒరికెళతా పిల్లడా, నేను ఆ ఊరికేళతా పిల్లడా
చల్లపల్లి కేలుత చల్లంగా ఉంటది
నిమ్మకూరు కేలుత నిమ్మలంగా ఉంటది
గుడివాడ కేలుత గుడిలోన మొక్కుతా
పాలమూరు కేలుత, పాలపిట్ట సూస్తా..
ఏ వరంగల్లు కెలుత పిల్లడా… ఓ… ఓ…
వరంగల్లు కెలుతా పిల్లడా…
వేల వరాలు పొందుతా పిల్లడా…
ఓయ్ ఆ ఊరికేళతా పిల్లడా… నేను ఆ ఊరికేళతా పిల్లడా…
ఆ ఊరికేళతా పిల్లడా… నేను ఆ ఊరికేళతా పిల్లడా…
మా ఊరు రావే పిల్లా,నువ్వు మా ఊరు రావే పిల్లా…
అరే… మీ ఊరుకోస్తే పిల్లాడా…
నువ్వు నాకేమి ఇత్తవ్ పిల్లడా…
కొబ్బరాకు చాప వేసి, అరిటాకు విస్తారేసి,
వేడి వేడి అన్నమేసి, కందిపొడి పచ్చడేసి,
చల్లమిరపకాయ వేసి, నువ్వులపడాలు వేసి,
మిర్యాల చారు వేసి, పెసరు పప్పు పునుగులేసి,
గారలేసి, బూరలేసి, పాత ఆవకాయ వేసి,
కొత్త చింతకాయ వేసి, ముక్కల పులుసేసి,
గడ్డ పెరుగు పచ్చడేసి, ఆవాల పొడివేసి,
ఆవు నెయ్యి వేసి…
ఆహా…
నేను తింటా, నువ్వు సూడు
హు…
ఊరికే అన్ననే పిల్లా, ఊరూరికే అన్నానే పిల్లా
నువ్వు మా ఊరొస్తే పిల్లా, నీకు అడిగింది ఇస్తా పిల్లా
అమ్మతోడే…
Ye Oorikelthave Pilla song is from the Seetha Payanam movie.
Ye Oorikelthave Pilla song was sung by Rahul Sipligunj, Madhu Priya.
Ye Oorikelthave Pilla song lyrics were written by ChandraBose.
Ye Oorikelthave Pilla song music was composed by Anup Rubens.