
| Movie Name | Anand (2004) |
|---|---|
| Director | Sekhar Kammula |
| Star Cast | Raja, Kamalini Mukherjee |
| Music | K M Radhakrishnan |
| Singer(s) | Hariharan, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం… సంధ్యా రాగం
నిజమైనాయి కలలు… నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం… సంధ్యా రాగం
నిజమైనాయి కలలు… నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం… సంధ్యా రాగం
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగా విధినైనా… చేసేదే ప్రేమా
హృదయంగా తననైనా మరిచేదే ప్రేమా
మరువకుమా ఆనందమానందమాందమాయేటి మనసు కథా
మరువకుమా ఆనందమానందమాందమాయేటి మనసు కథా
యమునా తీరం… సంధ్యా రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు… విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు… మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమా
చిగురించే ఋతువల్లే… విరబూసే ప్రేమా
మరువకుమా ఆనందమానందమాందమాయేటి మధుర కథా
మరువకుమా ఆనందమానందమాందమాయేటి మధుర కథా
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
Yamuna Teeram song is from the Anand movie.
Yamuna Teeram song was sung by Hariharan, Chitra.
Yamuna Teeram song lyrics were written by Veturi Sundararama Murthy.
Yamuna Teeram song music was composed by K M Radhakrishnan.