
| Movie Name | Anand (2004) |
|---|---|
| Director | Sekhar Kammula |
| Star Cast | Raja, Kamalini Mukherjee |
| Music | K M Radhakrishnan |
| Singer(s) | Shreya Ghoshal |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న… బాధలెన్నొ మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న… గాధలెన్నొ మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా
పిల్ల పాపల వాన… బుల్లి పడవల వాన
చదువు బాధనే తీర్చి… సెలవులిచ్చిన వాన
గాలి వాన కబడ్డి… వేడి వేడి పకోడి
ఈడు జోడు డి డిడిడి… తోడుండాలి ఓ లేడి
ఇంద్రధనస్సులొ తళుకుమనే ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాల జలతరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం
ఓ, కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నాయ్
వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కోరి వచ్చినా ఈ వాన… గోరు వెచ్చనై నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరేస్తె… ముద్దులాటిదే మురిపానా
మెరిసె మెరిసె అందాలు… తడిసె తడిసె పరువాలు
గాలి వానలా పందిళ్ళు… కౌగిలింతల పెళ్ళిళ్ళు
నెమలి ఈకలొ… ఉలికిపడె ఎవరి కన్నులో
చినుకు చాటునా… చిటికెలతో ఎదురు చూపులో
నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివానా లాలి పాడేస్తారా
వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివానా లాలి పాడేస్తారా
Vache Vache Nalla Mabbullara song is from the Anand movie.
Vache Vache Nalla Mabbullara song was sung by Shreya Ghoshal.
Vache Vache Nalla Mabbullara song lyrics were written by Veturi Sundararama Murthy.
Vache Vache Nalla Mabbullara song music was composed by K M Radhakrishnan.