
| Movie Name | Butta Bomma |
|---|---|
| Director | Shouree Chandrashekhar T Ramesh |
| Star Cast | Anikha Surendran, Arjun Das, Surya Vashistta |
| Music | Sweekar Agasthi |
| Singer(s) | Mohana Bhogaraju |
| Lyricist | Sanapati Bharadwaj Patrudu |
| Music Label |
Vinodamlo Kathemundo Lyrics in Telugu
పేరు లేని ఊరిలోకి కొత్త గాలొచ్చిందా
ఊసుపోక ఊసులెన్నో తీసుకొస్తూ ఉందా
వినోదంలో ఓ ఓ ఓ… కదేముందో ఓ ఓ ఓ
అంకె మారి లంకె వేసే కొత్త సంఖ్య వచ్చిందా
నవ్వులెన్ని మూటకట్టి మోసుకొస్తూ ఉందా
వినోదంలో ఓ ఓ ఓ కదేముందో ఓ ఓ ఓ
ఇరుగు పొరుగు ఇగటాలు ఆడటం జరుగు
పనిలో పనిగా చిరునవ్వే హాజరగు
మదికే సరదా చేస్తుంటే ఇంటిలో పనులు
ముగిసే వరకు ఎక్కడివి తీరికలు
హే, అలుపు సొలుపు అణువంత కూడా
తలదాచుకోని చురుకంటా
తన వెంటపడుతు నిమిషాలు
మెల్లగా కరిగే ప్రతిపూటా
కదేముందో ఓ ఓ ఓ
పేరు లేని ఊరిలోకి కొత్త గాలొచ్చిందా
ఊసుపోక ఊసులెన్నో తీసుకొస్తూ ఉందా
వినోదంలో ఓ ఓ ఓ కదేముందో ఓ ఓ ఓ
చిలికి చిలికి చిరుగాలి వానగా అవునో
చినుకూ చినుకూ దశలోనే అంతమవునో
అలతో తడిపి మనసార ఆడిన కడలి
మునిగే వరకు లోతెంతో చెప్పదుగా
హే కనులనడిగి మరి చేరుతాయా
మది కోరుకున్న కలలైనా
ఇక నిన్నలోని గల
లోటుపాటులను రేపే పూడ్చేనా
వినోదంలో ఓ ఓ ఓ కదేముందో ఓ ఓ ఓ
హో, పేరు లేని ఊరిలోకి కొత్త గాలొచ్చిందా
ఊసుపోక ఊసులెన్నో తీసుకొస్తూ ఉందా
వినోదంలో ఓ ఓ ఓ… కదేముందో ఓ ఓ ఓ
అరె, అంకె మారి లంకె వేసే కొత్త సంఖ్య వచ్చిందా
నవ్వులెన్ని మూటకట్టి మోసుకొస్తూ ఉందా
వినోదంలో ఓ ఓ ఓ కదేముందో ఓ ఓ ఓ
Vinodamlo Kathemundo song is from the Butta Bomma movie.
Vinodamlo Kathemundo song was sung by Mohana Bhogaraju.
Vinodamlo Kathemundo song lyrics were written by Sanapati Bharadwaj Patrudu.
Vinodamlo Kathemundo song music was composed by Sweekar Agasthi.