
| Movie Name | Adbhutham |
|---|---|
| Director | Mallik Ram |
| Star Cast | Teja Sajja, Shivani Rajashekar |
| Music | Radhan |
| Singer(s) | Rahul Sipligunj |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Lahari Music | T-Series |
వెన్నెల్లో గోదారి చూస్తూనే ఓసారి
గల్లంతే అయ్యిందే నా గుండె జారి
వెంటాడి వేటాడి పోతున్న అల్లాడి
అయినా నీ జాడేది రా ఒక్కసారి
మళ్ళీ మళ్ళీ చూశా నిన్నే
పిల్లో పిల్లో నీ కల్లో రానీవా నన్నే
వీధీ వీధీ వెతికా నిన్నే
ఏదీ ఏదీ ఏదేది నీ ఇల్లేడుందే
ఈ గుడిలో మొదటే నిను చూశా
దేవుడినే సలహా అడిగేశా
పాపాలనే పూర్తిగా కడిగేశా
పాపా నిన్నే ఇమ్మని మొక్కేశా
నామాలు పూసి నీ నామమే
నే జపాలు చేశా కధే
నా పిచ్చి చూసి ఓసారి అయినా
కనిపించి పోరాదటే
ఈ దుంప తెంపే కష్టాలు అన్ని
పగోడికి వద్దులే
ప్రేమెంత ఉందొ చెప్పేస్తా నీకే
వయ్యారి వస్తావటే
చీకటిలో కవితలు రాసేశా
గోడలపై మనసుని గీసేశా
నిన్నే కొత్త దేశం చేసేశా
నిన్నెతికే కోలంబస్ నై పోయా
నువ్ పలికే తననానా తకధిమిలే
నను కుదిపే ఎద కదిపే ఇటువైపే పంపేనే
నా కనులే నిద్దుర మాని
నిన్నెతికే చూపుల్లో చెలి పుట్టే కార్చిచ్చే నింపేనే
ఏనాడు లేదు ఇంత అందం
నిన్న కంటేనే కలరొచ్చే లోకం
నువ్వు తోడొస్తే పెరిగేను కొంచెం, నమ్మే నమ్మే
వేచి వేచి నే చూస్తానే
మరిచైతే నే నిన్ను పోలేనే
మరుజన్మ ఎత్తైన వస్తానే, నమ్మే
భాధ కూడా నాకు బాగుందే
ఒక వైపు నొప్పున్న నచ్చిందే
వచ్చి వాలేవా మబ్బల్లే కమ్మే
చీకటిలో కవితలు రాసేసా
గోడలపై మనసుని గీసేసా
నిన్నే కొత్త దేశం చేసేసా
నిన్నెతికే కోలంబస్ నై పోయా
Vennello Godhari song is from the Adbhutham movie.
Vennello Godhari song was sung by Rahul Sipligunj.
Vennello Godhari song lyrics were written by Krishna Kanth.
Vennello Godhari song music was composed by Radhan.