| Movie Name | & English - Sagara Sangamam |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Kamal Haasan, Jaya Prada |
| Music | Ilaiyaraaja |
| Singer(s) | S P Balasubramanyam, SP Sailaja |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
మువ్వా గోపాలుడే… మా ముద్దు గోవిందుడే
అహ, అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నల్లు దోచాడే
ఆ ఆహాహా, వే వేలా గోపెమ్మలా… మువ్వా గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే… నిన్ను కన్న వెన్నకాడే
మన్ను తిన్న చిన్నవాడే… నిన్ను కన్న వెన్నకాడే
కన్నతోడు లేనివాడే… కన్నెతోడు ఉన్నవాడే
మోహనాలు వేణువూదే… మోహనాంగుడితడేనే
మోహనాలు వేణువూదే… మోహనాంగుడితడేనే
ఆ ఆ ఆఆ, చీరలన్ని దోచి… దేహచింతలన్ని తీర్చినాడే
పోతన్న కవితలన్ని… పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే… మా ముద్దు గోవిందుడే
ఆ ఆహాహా, వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే… వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే… వేల తీరులున్నవాడే
రాసలీలలాడినాడే… రాయబార మేగినాడే
గీతార్ద సారమిచ్చి… గీతలెన్నో మార్చేనే
గీతార్ద సారమిచ్చి… గీతలెన్నో మార్చేనే
ఆ ఆఆ ఆ, నీలమై నిఖిలమై… కాలమై నిలిచాడే
వరదయ్య గానాల… వరదలై పొంగాడే
మా మువ్వా గోపాలుడే… మా ముద్దు గోవిందుడే
ఆ ఆహా హా, వే వేలా గోపెమ్మలా… మువ్వా గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
అహ, అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే, మ్
మది వెన్నల్లు దోచాడే
అహ, అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే, మ్
మది వెన్నల్లు దోచాడే
ఆ ఆహా హా, వే వేలా గోపెమ్మలా… మువ్వా గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
Ve Vela Gopemmala song is from the & English - Sagara Sangamam movie.
Ve Vela Gopemmala song was sung by S P Balasubramanyam, SP Sailaja.
Ve Vela Gopemmala song lyrics were written by Veturi Sundararama Murthy.
Ve Vela Gopemmala song music was composed by Ilaiyaraaja.