| Movie Name | Bombay (2025) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Arvind Swamy, Manisha Koirala |
| Music | A.R. Rahman |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
Urike chilakaa vechi untanu kadavaraku
Kurise chinukaa velluvainave edavaraku
Chelivai.. sakhivai.. rendu hrudayala kadhalu vinu
Bratuke.. baruvai.. nindu virahaala kaburu vinu
Kaatukaa kallatho kaatu vesaavu nannepudo
Kaalam chellithe intha mannesi po ipudu
Urike chilakaa vechi untanu kadavaraku
Kurise chinukaa velluvainave edavaraku
Charanam 1:
Nee raaka kosam tholi praanamainaa daachindi naa valape
Manasanti maguva ye jaamu raaka chithimantale reype
Naa kada praanam ponivvu kadha maasipodu.. adi kaadu naa vedana
Vidhi vipareetham nee meeda apavaadu vesthe.. eda kungipoyenu le
Modhalo.. thudhalo.. vadilesaanu neeke priyaa
Urike chilakaa vachchi vaalindi kalatha vidi
Cheligaa sakhilaa thaanu cherindi cheluni odi
Nelave telipi ninnu cherindi gathamu vidi
Kalaki ilaki ooyaloogindi kantapadi
Kaatukaa kallatho kaatu vesaavu nannepudho
Kaalam chellithe intha mannesi po ipudu
Urike chilakaa vechi untanu kadavaraku
Kurise chinukaa velluvainave edavaraku
Charanam 2:
Tholi praanamainaa okanaati prema maasedi kaadu suma
Oka kanti geetham jalapathamaithe maru kannu navvadamma
Naa paruvaala paradhaalu tholaginchi vaste kanneeti mudupaayene
Ne purivippi parughetti gaalalle vachcha nee veenugaanaaniki
Arere.. arere.. nedu kanneeta thene kalise
Urike chilakaa vechi untanu kadavaraku
Kurise chinukaa elluvainave edavaraku
Chelivai.. sakhivai.. rendu hrudayala kadhalu vinu
Bratuke.. baruvai.. nindu virahaala kaburu vinu
Mohamo.. maikamo rendu manasullo virisinadi
Paashamo.. bandhamo.. unna dooraalu cheripinadi
Urike chilakaa vachchi vaalindi kalatha vidi
Nelave telipi ninnu cherindi gathamu vidi
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా వెల్లువైనావె ఎదవరకు
చెలివై.. సఖివై.. రెండు హృదయాల కధలు విను
బ్రతుకే.. బరువై.. నిండు విరహాల కబురు విను
కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా వెల్లువైనావె ఎదవరకు
చరణం 1:
నీ రాక కోసం తొలి ప్రాణమైనా దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక చితిమంతలే రేపే
నా కడ ప్రాణం పోనివ్వు కధ మాసిపోదు.. అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే.. ఎద కుంగిపోయేనులే
మొదలో.. తుదలో.. వదిలేసాను నీకే ప్రియా
ఉరికే చిలకా వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
కలకి ఇలకి ఊయలూగింది కంటపడి
కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా వెల్లువైనావె ఎదవరకు
చరణం 2:
తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికి
అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై.. సఖివై.. రెండు హృదయాల కధలు విను
బ్రతుకే.. బరువై.. నిండు విరహాల కబురు విను
మోహమో.. మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో..బంధమో.. ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకా వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి