
| Movie Name | 14 Days Love |
|---|---|
| Director | Nagaraj Bodem |
| Star Cast | Manoj Puttur, Chandini Bagawanani |
| Music | Kiran Venna |
| Singer(s) | Karunya |
| Lyricist | Giri Patla |
| Music Label | Tips Telugu |
ఉన్నపాటుగా… నా తనువు తూగెనే
తేనె పెదవితో… ప్రాణం పోయగా, ఓహో
ఉన్నచోటనే… నా ఉనికి మారెనే
గుండె లోపలి దాహం తీరగా, ఓహో
మనసు మమతతో… అల్లేందుకే అనీ
నన్ను చేరెనే… నేనే నువ్వనీ
ఇది నాలో ఓ కలలా గమ్మత్తుగున్నదే
ఓహో ఓహో… మరి జన్మ నీదని
ఓహో ఓహో… మది నిన్ను కోరెనే
ఓహో ఓహో… నా కంటి పాపలో
ఓహో ఓహో… చెలి నిన్ను దాచెనే
ఉన్నపాటుగా… నా తనువు తూగెనే
తేనె పెదవితో… ప్రాణం పోయగా, ఓహో
నా ఎదను చేరి నువ్వు… నాలో చప్పుడైతివే
ఇక రేయి పగలు నన్ను… కుదురుగుండనివ్వవే
పరిచయం చేసి అధరం… ప్రేమ ముద్దరేస్తివే
చెరిసగం చూపి మధురం… ప్రియా దగ్గరైతివే
వానల్లే వచ్చావు… వరదల్లే ముంచావు
ప్రేమంటూ టెన్ టు ఫైవ్ తేల్చావులే
దారుల్ని మార్చావు… ఆధారమయ్యావు
ప్రేమెంతో పంచావులే
రంగుల్లో ముంచేసి… మెరుపల్లే మెరిపించి
జాతర్లే చేసావుగా
నీ అడుగు జాడల్లో… నేనింకా వస్తున్నా
నా జాడ అయ్యావుగా
ఇది నాలో ఓ కలలా గమ్మత్తుగున్నదే
ఓహో ఓహో… మరి జన్మ నీదని
ఓహో ఓహో… మది నిన్ను కోరెనే
ఓహో ఓహో… నా కంటి పాపలో
ఓహో ఓహో… చెలి నిన్ను దాచెనే
నా కలలు కళ్ళు దాటి… నీతో ముచ్చటించేనే
వేవేల ఆశలెన్నో… ఇక వెంట తెచ్చేనే
నీ వలపు తలుపు తట్టి… నాతో వంత పాడేనే
నీవుంటే బంధమల్లి… రోజు పండాగాయెనే
ఆరారు కాలాల వర్ణాలు నీలోన
ఈనాడే చూశానుగా
ఊహల్లో ఊరేగి… ఊపిరిలో ఊగేసి
నాలోన చేరావుగా
అనుమానం లేదింక ఆలస్యం కాదింకా
నా తోడు నువ్వేనులే
నేనంతా నీలోన నువ్వంతా నాలోన
జన్మంతా కలిసుందుమే
ఉన్నపాటుగా నా తనువు తూగెనే
తేనె పెదవితో… ప్రాణం పోయగా, ఓహో ఓ
Unnapaatuga song is from the 14 Days Love movie.
Unnapaatuga song was sung by Karunya.
Unnapaatuga song lyrics were written by Giri Patla.
Unnapaatuga song music was composed by Kiran Venna.