
| Movie Name | Folk Song 2026 (2026) |
|---|---|
| Director | Pavan Rathod |
| Star Cast | Indravathi Chauhan |
| Music | Kumar Myric |
| Singer(s) | Indravathi Chauhan |
| Lyricist | Bhasker Mangarai |
| Music Label | Dhee pavan rathod |
ఉలకడాయే పలకడాయే ఓ లచ్చ గుమ్మడి
అలగనన్న అలగడాయే ఓ లచ్చ గుమ్మడి
ఉలకడాయే పలకడాయే ఓ లచ్చ గుమ్మడి
అలగనన్న అలగడాయే ఓ లచ్చ గుమ్మడి
కానడాయే సూడడాయే ఓ లచ్చ గుమ్మడి
గూటిలో గుండ్రాయి తీరే ఓ లచ్చ గుమ్మడి
కానడాయే సూడడాయే ఓ లచ్చ గుమ్మడి
గూటిలో గుండ్రాయి తీరే ఓ లచ్చ గుమ్మడి
అందాల సిన్నదాన్ని గింతనన్న సూడడాయే
వయ్యారి వన్నెదాన్ని తాకనన్న తాకడాయే
ఏం మందు పెట్టినాడో యెంట యెంట తిప్పుకున్నాడే
అరె సన్నుగూడాయే గొనుసుడాయే ఓ లచ్చ గుమ్మడి
కంటికి కునుకన్నా రాదే ఓ లచ్చ గుమ్మడి
సన్నుగూడాయే గొనుసుడాయ...
ఉలకడాయే పలకడాయే ఓ లచ్చ గుమ్మడి
అలగనన్న అలగడాయే ఓ లచ్చ గుమ్మడి
ఉలకడాయే పలకడాయే ఓ లచ్చ గుమ్మడి
అలగనన్న అలగడాయే ఓ లచ్చ గుమ్మడి
గోళమేసినట్టు పట్టిలాగుతున్న పరువాలనైనా సూడాడే గుమ్మడి
గాలిసోకినట్టు వీడి మొండిపట్టు గుండ్లు ఎర్ర చేసి బిర్రుగుంటాడే గుమ్మడి
అరె కలవాడాయే పిలవాడాయే ఓ లచ్చ గుమ్మడి
ఎదురుపడితే బెదురు సూపే ఓ లచ్చ గుమ్మడి
కలవాడాయే పిలవాడాయే ఓ లచ్చ గుమ్మడి
ఎదురుపడితే బెదురు సూపే ఓ లచ్చ గుమ్మడి
ఆడడాయే పాడడాయే ఓ లచ్చ గుమ్మడి
తిన్నదెట్టా అరగబట్టే ఓ లచ్చ గుమ్మడి
ఆడడాయే పాడడాయే ఓ లచ్చ గుమ్మడి
తిన్నదెట్టా అరగబట్టే ఓ లచ్చ గుమ్మడి
నా కళ్లన్నీ కాయగాసే పట్టుమట్టి సూసుడాయే
ఆడాళ్ళ గుంపు అంత వాని సూట్టుముట్టుడాయే
రథమోలే తిరుగుతున్న రాయొలే కథలడాయే
వాడు చెట్టు కాదే పుట్ట కాదే ఓ లచ్చ గుమ్మడి
మనిషై పుట్టినాడే ఓ లచ్చ గుమ్మడి
వాడు చెట్టు కాదే పుట్ట కాదే ఓ లచ్చ గుమ్మడి
మనిషై పుట్టినాడే ఓ లచ్చ గుమ్మడి
ఉలకడాయే పలకడాయే ఓ లచ్చ గుమ్మడి
అలగనన్న అలగడాయే ఓ లచ్చ గుమ్మడి...
ఏమి ఏమి ఏమి ఏమి ఏమి తెల్వనట్టు ఇప్పడాయే గుట్టు
వరసైన సరసమాడాడే గుమ్మడి
తెగించి గల్లపట్టు రాయి పెట్టి కొట్టు
కోపమైన సూప జాలాడే గుమ్మడి
పొద్దునాయే రాతిరాయే ఓ లచ్చ గుమ్మడి
రోజులిట్టా గడిచిపాయే ఓ లచ్చ గుమ్మడి
పొద్దునాయే రాతిరాయే ఓ లచ్చ గుమ్మడి
రోజులిట్టా గడిచిపాయే ఓ లచ్చ గుమ్మడి
ముట్టడాయే పట్టడాయే ఓ లచ్చ గుమ్మడి
ఆశలేమో బుట్టేడాయే ఓ లచ్చ గుమ్మడి
ముట్టడాయే పట్టడాయే ఓ లచ్చ గుమ్మడి
ఆశలేమో బుట్టేడాయే ఓ లచ్చ గుమ్మడి
మా పక్కూరి పోరగాడే మేనత్త కొడుకు వీడే
మేలైనా మాయగాడే మా మేనబావ వీడే
వరసైన వన్నెగాడే మనస...
అడ్ఢడే సిక్కడాయే దొరకడాయే ఓ లచ్చ గుమ్మడి
అనగబడితే జౌడాపాయే ఓ లచ్చ గుమ్మడి
సిక్కడాయే దొరకడాయే ఓ లచ్చ గుమ్మడి
అనగబడితే జౌడాపాయే ఓ లచ్చ గుమ్మడి
ఉలకడాయే పలకడాయే ఓ లచ్చ గుమ్మడి
అలగనన్న అలగడాయే ఓ లచ్చ గుమ్మడి
ఉలకడాయే పలకడాయే ఓ లచ్చ గుమ్మడి
అలగనన్న అలగడాయే ఓ లచ్చ గుమ్మడి...
add:
Ulakadaye Palakadaye song is from the Folk Song 2026 movie.
Ulakadaye Palakadaye song was sung by Indravathi Chauhan.
Ulakadaye Palakadaye song lyrics were written by Bhasker Mangarai.
Ulakadaye Palakadaye song music was composed by Kumar Myric.