
| Movie Name | Folk Song 2026 (2026) |
|---|---|
| Director | Raj narendera |
| Star Cast | Pooja Nageshwar,Hanamanth Yadav |
| Music | Dj shekar ichoda |
| Singer(s) | Srinidhi |
| Lyricist | Hema Reddy |
| Music Label | Bommaarillu Folks |
M"ఏ రోజు అనుకోలేదే ఈ రోజంటు వస్తుందనీ.
కలనైన కలగనలేదే మనము ఏకాకులవుతామనీ.
"F"కన్నపేగు బంధమే మనపై కన్నెర్ర జేస్తుందనీ..
కన్నీరే మన బంధువై మనతో కలిసే నడిచొస్తుందనీ..
"M"ఆపద్దే ఆకంట నీరు అవ్వి దాగుంటే గుండెతో బరువు.
"F"అయ్యామ మనవాళ్ళకు బరువు అయ్యో మనకంటే ఎక్కువనా పరువు.
"ఏ రోజు అనుకోలేదె"
1"చరణం"
"M"ఇష్టపడి ప్రేమిస్తే తప్పంటారే.
గుణమెరుగక కులము జాతంటారే.
"F"కష్టమైనా కలిసే ఉంటామంటే
కలిపె పంపిస్తాం కాటికంటారే..
"M"కాసంత కనికరమే లేదే కన్నా ప్రేమ కఠినంగా మారిందే..
"F"ఊరి నుండి వెలివేస్తుంటే మనకు అడవితల్లి అమ్మయిందే..
"M"ప్రేమిస్తేనే పెద్ద తప్ప ప్రేమ పేరుతో వెలివేయడము గొప్ప.
"F"పాతికేళ్లు పెంచిన ప్రేమ పరువు కోసం వదిలేసుడు మీ మెప్ప.
"ఏ రోజు అనుకోలేదె"
2"చరణం"
"M"అయ్యో బ్రహ్మా నొసటిన రాతేందయ్య
యాదిమర్తివ ఆగం ఐతిమయ్యా..
"F"గుండెలపై ఆడించిన తండ్రి ప్రేమ
గుణపాలే దించాలని చూస్తుందయ్య..
"M"కన్న పేగు బంధంతెంచి రామ కండ్లముందే నీళ్ళొదిలారే..
"F"కండ్లల్ల కసి పెంచినారు వాళ్లు మాటలతో సంపుతున్నారు.
"M"నిండు సులాలన్నమాటే మరిసి మన్నులో కప్పుతంటారు..
"F"మమకారం మంటల్ల కలిపి దేవ మాయంజేయ చూస్తున్నారు..
"ఏ రోజు అనుకోలేదె"
3"చరణం"
"M"ఎవరు లేకున్న నీకు నేనునమ్మ
నా కట్టేకాలే వరకు కలిసుంటమ్మ.
"F"ఈ మాట చాలు గడిపేస్తజన్మ
ఏ కష్టంలైన నీకు అవుత అమ్మ.
"M"కంటిరెప్పోలె కాసుకుంటమ్మ నీ కాలు కందనీయ బంగరుబొమ్మ.
'F"నా బతుకంత నీదెలేవయ్య ఒట్టు కడవరకు కలిసుంటానయ్య.
"M"నా మహారాణి నువ్వేలె అంట నీకు బంటునై నీ తోడు ఉంట..
"F"నీ ప్రతిరూపం నా కడుపున పంట మనకు యువరాణి జన్మించునంట..."2"
KADADHAKA NEETHONE song is from the Folk Song 2026 movie.
KADADHAKA NEETHONE song was sung by Srinidhi.
KADADHAKA NEETHONE song lyrics were written by Hema Reddy.
KADADHAKA NEETHONE song music was composed by Dj shekar ichoda.