
| Movie Name | Itlu Maredumilli Prajaneekam |
|---|---|
| Director | AR Mohan |
| Star Cast | Allari Naresh, Anandhi |
| Music | Sri Charan Pakala |
| Singer(s) | Ravi Prakash Chodimalla |
| Lyricist | Shree Mani |
| Music Label | Zee Music South |
ఏ, తెల్లవారే కాంతులూరే
కొత్తరోజే పిలిచెనులేరా
హత్తుకోరా మనసుకు ఇష్టంగా
అరె, సొంతవారే కానివారే
ఒక్కరైనా కనిపించరుగా
సాయమవదా మనిషికి నేస్తంగా
నువ్వంటే నువ్ కాదురా
నీ చుట్టూ ఉన్నవాళ్లు కదరా
ప్రతి హృదయం నీదేనురా
చప్పుడులోని పేరే వినబడదా
ఏ, గాయపడితే ఒక్క కాకికి
వంద కాకులు సాయంరా
ఏకాకి లాగ నువ్వే మిగలకురా
ఏ, ఒంటరల్లే ఏ మనిషైనా
కంటబడితే చెంతకురా
స్నేహమేగా అందిద్దాం పదరా
కంచు మోగితే వచ్చు శబ్దమే
కనకమప్పుడు ఇవ్వదురా
బంగారమేసి గుడి గంట కట్టదెవడూ
తన ఉనికినెప్పుడు వెలుగు చప్పుడు
చీకటల్లే టెన్ టు ఫైవ్ చూచిందురా
నువ్వు నువ్వు ఏమార్చుకోకు ఎప్పుడూ
అన్నిటికన్నా గొప్పది అంటాం విధ్యాదానాన్నే
నమ్ముకు బతికే లోకమురా మనదే
తోచినంతలో పక్కనోడికందించావో చదువే
మరి నిన్నే మించిన గురువే ఉండడుగా
జనమంటే నువ్వే కదరా
జగమంటే నువ్వే కదరా
ఇంతకంటే ఏం చెప్పగలదు
శ్రీ కృష్ణుడి గీతైనా
Thellavaare song is from the Itlu Maredumilli Prajaneekam movie.
Thellavaare song was sung by Ravi Prakash Chodimalla.
Thellavaare song lyrics were written by Shree Mani.
Thellavaare song music was composed by Sri Charan Pakala.