| Movie Name | & English - Mamidi Mounika |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Sv Mallik Teja |
| Singer(s) | Mamidi Mounika |
| Lyricist | |
| Music Label | MV MUSIC & MOVIES |
సువ్వి సువ్వన్నెల్లారా… సువ్వన్నెల్లారా…
ఓ… సువ్వన్నెల్లారా… సువ్వాని పాడారమ్మ సీరాములారా…
ఓ రఘురాములారా…
ఉడుగులూ కొట్టిచ్చి… ఊరు వందిచ్చి… ఓ వందిచ్చి…
కానుగులూ కొట్టిచ్చి… కట్టా వందిచ్చి… ఓ కట్టా వందిచ్చి…
సువ్వి సువ్వన్నెల్లారా… సువ్వన్నెల్లారా…
ఓ… సువ్వన్నెల్లారా… సువ్వాని పాడారమ్మ శ్రీరాములారా…
ఓ సీతారాములారా…
బండాలన్నీ తీపిచ్చి బాయి తొవ్విచ్చి… ఓ బాయి తొవ్విచ్చి…
పొరకాలన్నీ ఏరిచ్చి పొలము దున్నిచ్చి… పొలము దున్నిచ్చి…
అట్లెట్లా పొయ్యేటీ ఆవులెవ్వరియో… ఆ గోవులెవ్వరియో…
గోవులా మేపేటి బాలుడెవ్వరో… సిన్ని బాలుడెవ్వరో…
సువ్వి సువ్వన్నెల్లారా… సువ్వన్నెల్లారా…
ఓ… సువ్వన్నెల్లారా… సువ్వాని పాడారమ్మ శ్రీరాములారా…
సీతారాములారా…
ల ల ల ల లె లె లేలే లేలే…
మూతిరగా మేసినట్టి ముచ్చన్నా ఎడ్లూ… నా ముచ్చన్నా ఎడ్లూ…
మురుసుకుంటనే వస్తున్నాయి మురికి నీళ్ళకు… నా మురికి నీళ్ళకు…
నా బమధీరా మేసినట్టి బద్దిరన్న ఎడ్లూ… నా బద్దిరన్న ఎడ్లూ…
అగ్గో… బంసుకుంటనే వస్తున్నాయి బాయి నీళ్ళకు… నా బాయి నీళ్ళకు…
సువ్వి సువ్వన్నెల్లారా… సువ్వన్నెల్లారా…
ఓ… సువ్వన్నెల్లారా… సువ్వాని పాడారమ్మ శ్రీరాములారా…
సీతారాములారా…
గొర్రెలా కాసేటి గొల్లోల్ల తాత… ఓ గొల్లోల్ల తాత…
పిండవయ్యా పాపకు కడువల్ల పాలు… ఎండి కడవల్ల పాలు…
నా కొత్తల్లా మా రాజు కోమట్ల సేటు… ఓ కోమట్ల సేటు…
తేవయ్యా పిల్లకు తేనె పుట్నాలు… ఓ తేనె పుట్నాలు…
సువ్వి సువ్వన్నెల్లారా… సువ్వన్నెల్లారా…
ఓ… సువ్వన్నెల్లారా… సువ్వాని పాడారమ్మ శ్రీరాములారా…
సీతారాములారా…
ల ల ల ల లె లె లేలే లేలే…
నిమ్మకింద నీలక్క నిలిసుంటావేందే… అట్ల నిలిసుంటావేందే…
బండాకాడి బాలక్క కురిపెలు పట్టుండ్రే… దవ్వన కలుపులు తియ్యుండ్రే…
పొద్దెల్లీ పోకముందే మునుమెల్లి రాండ్రే… అక్క మునుమెల్లి రాండ్రి…
లేకుంటే నా పంట ఎనుకైపోతాదే… సెల్లె ఎనుకైపోతాదే…
సువ్వి సువ్వన్నెల్లారా… సువ్వన్నెల్లారా…
ఓ… సువ్వన్నెల్లారా… సువ్వాని పాడారమ్మ శ్రీరాములారా…
సీతారాములారా…
నా సిన చెరువూ కట్టా మీద సిలుకలా మోత… నా సిలుకలా మోత…
సింగారి నా బావ వచ్చన్నా పోడా… నన్ను సూసన్నా పోడా…
నా పేద చెరువూ కట్టా మీద పాయిరాల మోత… నా పాయిరాల మోత…
బంగారి నా బావ వచ్చన్నా పోడా… నన్ను సూసన్నా పోడా…
వచ్చన్నా పోడా… నన్ను సూసన్నా పోడా…
Suvvi Suvannellara Folk song is from the & English - Mamidi Mounika movie.
Suvvi Suvannellara Folk song was sung by Mamidi Mounika.
Suvvi Suvannellara Folk song music was composed by Sv Mallik Teja.