
| Movie Name | & English - Mamidi Mounika |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
సింగర్: మామిడి మౌనిక
లిరిక్స్, మ్యూజిక్: ఎస్వి మల్లిక్ తేజ
డైరెక్షన్: నరసింహన్ ఎలమంద్రి
లేబుల్: Mv Music & Movies
ఎనుకకెళ్ళి ఎవలో పిలిసినట్టు.. నా ఎంబడెంబడే నడిసినట్టు..
గుండెల్లో పాణాలు గుచ్చినట్టు.. మల్ల ఎండల్లు వానల్లు కొట్టినట్టు…
సిత్తురాల మనసు సిత్తు బొత్తు అయుతున్నదో..
నా సిత్తమంత పక్కమేసి ఇగ్గుతున్నదో…
అయ్యో.. సిత్తురాల మనసు సిత్తు బొత్తు అయుతున్నదో..
నా సిత్తమంత పక్కమేసి ఇగ్గుతున్నదో…
ఇంతకముందోలే లేనే లేను.. నేను ఇన్నొద్దుల దాన్ని కానే కాను..
అయ్యో నా రూపు పాడుగాను.. ఎంతకర్థమైతలేను ఏడపోను…
నా మొండితనమంత గంగల కలిసిందిరో.. గిట్ల మారిన్నాని నాకిప్పుడే తెలిసిందిరో.. || 2 ||
మరుగు మందు ఏదో పెట్టినట్టు నన్ను మలుపుకుంటివిరో నీ దిక్కు..
మనసుల మనసే ఉంటలేదు.. నా మాట అస్సలే వింటలేదు…
సేతబడి ఏదో సేసినట్టున్నావురో..
ఎవలకు సెప్పుకోలేక సచ్చిపోతున్నానురో.. || 2 ||
పాతాల్లా గరికేసి గెలికినట్టు.. పుట్టమన్నుతోటి ఇల్లు అలికినట్టు..
తాపకొక్కతీరు మారుతుంది మనసు.. నీకొరకే తండ్లాడుతుంది…
నీ అడుగుజాడలు అద్దాల మేడలురో. ఓ ఓ..
నువ్వు సెప్పే మాటలు పువ్వుల తోటలురో..
నాకు.. నీ అడుగుజాడలు అద్దాల మేడలురో. ఓ ఓ..
నువ్వు సెప్పే మాటలు పువ్వుల తోటలురో…
కొబ్బరి కాయలు కొడ్త కొండగట్టు అంజన్న.. కోడె మొక్కులు కడ్త ఎములాడ రాజన్న..
కోరమీసం పెడ్త కొమురెల్లి మల్లన్న.. కోరుకున్న నా తోడునిస్తిరంటే…
ఎదురైన దేవుళ్ళ వేడుకుంటున్నానురో.. ఓ ఓ ..
ఎదలోన కోవెల కట్టుకుంటున్నానురో
ఎదురైన దేవుళ్ళ వేడుకుంటున్నానురో.. ఓ ఓ ..
నా.. ఎదలోన కోవెల కట్టుకుంటున్నానురో
Sithurala Manasu Folk song is from the & English - Mamidi Mounika movie.