
| Movie Name | Ala Vaikunthapurramuloo (2020) |
|---|---|
| Director | Trivikram |
| Star Cast | Allu Arjun, Pooja Hegde |
| Music | Thaman S |
| Singer(s) | Soorranna & Saketh Komanduri |
| Lyricist | Vijay Kumar Bhalla |
| Music Label | Aditya Music |
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు…
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు..
మంతనాలు చేసినాడు సిత్తరాల సిరపడు..
ఊరూరు ఒగ్గేసినా ఉడుం పట్టు ఒగ్గడు…
బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే…
బుగతోటి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే..
కొమ్ములూడదీసి మరీ.. పీపలూదినాడురో.
జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే
దెయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు….
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు..
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సెసినాడు..
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే..
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే..
ఈడీదుకుంటుబోయి గుంజుకొచ్చినాడురో..
ఈడీదుకుంటుబోయి గుంజుకొచ్చినాడురో.
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె…
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటె..
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు..
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు.
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప…
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప..
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు…
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు..
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి…
సాముసేసె కండతోటి దేనికైన గట్టిపోటి..
అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు.
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు..
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు..
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె..
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే..
Sittharala Sirapadu song is from the Ala Vaikunthapurramuloo movie.
Sittharala Sirapadu song was sung by Soorranna & Saketh Komanduri.
Sittharala Sirapadu song lyrics were written by Vijay Kumar Bhalla.
Sittharala Sirapadu song music was composed by Thaman S.