
| Movie Name | Swarna Kamalam (1988) |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Venkatesh, Bhanupriya |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
శివ పూజకు చివురించిన… సిరి సిరి మువ్వ
సిరిసిరి మువ్వ… సిరి సిరి మువ్వ
మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ… సిరి సిరి మువ్వ
యతిరాజుకు జతి స్వరముల పరిమలమివ్వ
సిరిసిరి మువ్వ… సిరిసిరి మువ్వ
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వ… సిరి సిరి మువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా
పరుగాపక పయనించవె… తలపుల నావ
కెరటాలకు తలవంచితె… తరగదు త్రోవా
పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకె సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వెదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించె కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హృదయ రవలి ఓంకారం కాని
శివపూజకు చివురించిన… సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ… సిరి సిరి మువ్వ
మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ… సిరి సిరి మువ్వ
తన వేళ్ళే సంకెళ్ళై… కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు.. ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది… అవనికి నలు దిక్కులా
ఆనందంపు గాలి వాలు… నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తొడుగా
పరుగాపక పయనించవె… తలపుల నావ
కెరటాలకు తలవంచితె… తరగదు త్రోవా
లలిత చరన జనితం… నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం… సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం… తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం… తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయములో
వికసిత శతదల శోభల సువర్ణ కమలం
పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా
(శ్రేయాన్ స్వధర్మః విగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్)
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః — – భగవద్గీత 3-35
Shiva Poojaku song is from the Swarna Kamalam movie.
Shiva Poojaku song was sung by S P Balasubramanyam, P Susheela.
Shiva Poojaku song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Shiva Poojaku song music was composed by Ilayaraja.