
| Movie Name | & English - Sakhi |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Madhavan, Shalini, Jayasudha |
| Music | A. R. Rahman |
| Singer(s) | S Janaki & Shankar Mahadevan |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Saregama South |
బాధ తీరునది శాంతి పోవునది
బాధ తీరునది శాంతి పోవునది
సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం… అక్టోబర్ మాసం
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో… ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో… కళ్యాణం పూర్తైన నాడే
సెప్టెంబర్ మాసం… సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం… అక్టోబర్ మాసం
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో… ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో… కళ్యాణం పూర్తైన నాడే
ఏయ్ పిల్లా..! కౌగిళ్ళలోపట ఇరుకు పసందు
కళ్యాణమయ్యాక వేపంత చేదు, ఏం కాదా
చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండేను
కళ్యాణం ప్రేమ ఏం కాదా
కన్నె ప్రేమకు మత్తు కళ్ళంట
కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంట పిల్లా
చిరు ముక్కు ఎరుపెక్కె కోపాల అందాలు
రసిక రసిక కావ్యం
కళ్యాణమయ్యాక చిరు బుర్రు తాపాలు
ఏం ఏం ఏం బాధలు
మా ఆడాళ్ళు లేకుంటే… మీకింక దిక్కేది
మీరే లేని లోకమందు… దిక్కులన్ని ఇక మావేగా
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం
అహహ్హ అహ అహహ్హ అహ అహహ్హ అహ
అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం
హా తెలిసెన్ కౌగిలి అన్నది కంఠమాల
కళ్యాణమన్నది కాలికి సంకెల, ఏం చేస్తాం
హా కళ్యాణమెపుడు నెట్టేసి పారెయ్యి
నూరేళ్ళ వరకు డ్యూయెట్లు పాడెయ్యి ఓ గుమ్మా
కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు అచ్చట్లు
కళ్యాణమయ్యాక కరువగులే బావా
విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది
అదే అదే ప్రేమ
ఒక చోట చిరకాలం మరు చోట చిరుకాలం
ఉందామా భామ
మా మగాళ్ళు లేకుంటే… మీకింక దిక్కేది
మీరేలేని లోకమందు… దిక్కులన్ని ఇక మావేగా
సెప్టెంబర్ మాసం… సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం… అక్టోబర్ మాసం
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో… ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో… కళ్యాణం పూర్తైన నాడే
September Maasam song is from the & English - Sakhi movie.
September Maasam song was sung by S Janaki & Shankar Mahadevan.
September Maasam song lyrics were written by Veturi Sundararama Murthy.
September Maasam song music was composed by A. R. Rahman.