
| Movie Name | Grandhalayam |
|---|---|
| Director | Sai Shivan Jampana |
| Star Cast | Vinnu Maddipati, Smrita Rani Borah |
| Music | Vardhan |
| Singer(s) | Dhanunjay |
| Lyricist | Sai Shivan Jampana |
| Music Label | Tips Telugu |
సావాసం కోసం సాగింది
నా పయనం తనతో అంటుంది
కాలమే ఆగనంతగా
ప్రయాణమై సాగుతున్నది
నేనెవ్వరూ చెప్పలేనుగా
నా పక్కగా నడవమన్నది
సమస్య ముందునుండి సవాలు విసురుతున్నా
శవాలు ప్రక్కనుండి సహనాన్ని చంపుతున్నా
సాగిపో ధీరుడా… సమరనా రుద్రనేత్రుడా
అదరకా బెదరకా… అలసి సొమ్మసిల్లకా
ఎదురొస్తున్న మృత్యువునైనా
ఆపవోయ్ ఆపవోయ్… ఓ కార్యసాధకా
నువ్వాపవోయ్ ఆపవోయ్… ఓ కార్యసాధకా
సావాసం కోసం సాగింది
ఈ పయనం తనతో అంటుంది
జరుగుతున్నది వింత నాటకం
జరిగిపోయేనే ఓ కపట జ్ఞాపకం
చుట్టు ఉన్నది శూన్యమైనది
సాహాసానికే తొలి అడుగు అయినది
ఒకప్పటిలాగా ఇప్పుడేదిరా
మౌనం తప్ప మిగిలింది ఏందిరా
యుద్ధం తప్పా చేసేది లేదురా
విరమించావో విముక్తి రాదురా
సాగిపో ధీరుడా… సమరనా రుద్రనేత్రుడా
అదరకా బెదరకా… అలసి సొమ్మసిల్లకా
ఎదురొస్తున్నా మృత్యువునైనా
ఆపవోయ్ ఆపవోయ్… ఓ కార్యసాధకా
నువ్వాపవోయ్ ఆపవోయ్… ఓ కార్యసాధకా
సావాసం కోసం సాగింది
ఈ పయనం తనతో అంటుంది
మరణశాసనం రాసి ఉన్నది
మృత్యుఘోషగా వెంటాడుతున్నది
నివురుగప్పిన నిప్పు అయినది
నింగీ నేలంతా అలుముకున్నది
ఆఖరి శ్వాసే నీ వెంట ఉందిరా
ఆకలి తీరుస్తావని అడుగుతుందిరా
ఆఖరి శ్వాసే నీ వెంట ఉందిరా
ఆకలి తీరుస్తావని అడుగుతుందిరా
సాగిపో ధీరుడా… సమరనా రుద్రనేత్రుడా
అదరకా బెదరకా… అలసి సొమ్మసిల్లకా
ఎదురొస్తున్న మృత్యువునైనా
ఆపవోయ్ ఆపవోయ్… ఓ కార్యసాధకా
నువ్వాపవోయ్ ఆపవోయ్… ఓ కార్యసాధకా
Saagipo Dheeruda song is from the Grandhalayam movie.
Saagipo Dheeruda song was sung by Dhanunjay.
Saagipo Dheeruda song lyrics were written by Sai Shivan Jampana.
Saagipo Dheeruda song music was composed by Vardhan.