
| Movie Name | Ravana Lanka (2020) |
|---|---|
| Director | BNS Raju |
| Star Cast | Murli Sharma, Devgill, Krish, Ashmitha |
| Music | Ujjal |
| Singer(s) | Kaala Bhairava |
| Lyricist | Bhashya Sree |
| Music Label | Aditya Music |
అరెరే అరెరే గుండె వేగమెలా పెరిగే… ఎగిసే ఎగిసే నేల నింగికేలా ఎగిసే
అందమైన అమ్మాయంటే ఆగదే మనసే…
అందులోన పక్కన ఉంటే నరకమే అసలే…
అరెరే అరెరే గుండె వేగమెలా పెరిగే… ఎగిసే ఎగిసే నేల నింగికేలా ఎగిసే
అందమైన అమ్మాయంటే ఆగదే మనసే…
అందులోన పక్కన ఉంటే నరకమే అసలే…
దూరంగా ఉండలేము… దరికొస్తే ఆగలేము
మౌనంగా ఉండలేము… మాటైనా చెప్పలేము
చనువెంతో చూపుతున్నా… ఊసైనా పలకరేమే
గుర్రాలే పరుగు తీసే… గుండెల్లో మీరు చూస్తే
ఉండాలా లేదా మేము… అందాలే దాడి చేస్తే
పువ్వు లాగ తేనే దాచి ఆశ పెడతారే…
కొమ్మలోని ముల్లై మీరు గుండె కోస్తారే…
కళ్ళల్లో సూదులేవో ఉంటాయే మీకు లలనా…
చూశారో ఒక్క చూపే చస్తామే దాని వలన…
పెదవుల్లో పెను తుఫానే దాగుందే లలనా…
యుద్ధాలే జరుగుతున్నై గుండెల్లో దాని వలన
నీ తీపి నవ్వు వలలో… చిక్కామా రాము మరలా
అందమైన మోసం అంటే… ఆడదే తెలుసా
అయినా గాని నచ్చును ఏంటో… ఈ వింత వరస
అరెరే అరెరే గుండె వేగమెలా పెరిగే… ఎగిసే ఎగిసే నేల నింగికేలా ఎగిసే
అందమైన అమ్మాయంటే ఆగదే మనసే…
అందులోన పక్కన ఉంటే నరకమే అసలే…
Ravana Lanka Arere song is from the Ravana Lanka movie.
Ravana Lanka Arere song was sung by Kaala Bhairava.
Ravana Lanka Arere song lyrics were written by Bhashya Sree.
Ravana Lanka Arere song music was composed by Ujjal.