| Movie Name | ( 369) In & English |
|---|---|
| Director | Singeetam Srinivasa Rao |
| Star Cast | Nandamuri Balakrishna, Mohini |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై… మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
కౌగిలింత వేడిలో… కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి… చల్లె పగటి వెన్నెలా
మోజులన్నీ పాడగా… జాజిపూల జావళి
కందెనేమో కౌగిట… అందమైన జాబిలీ
తేనెవానలోన చిలికే… తియ్యనైన స్నేహము
మేని వీణలోన పలికే… సోయగాల రాగము
నిదురరాని కుదురులేని… ఎదలలోని సొదలుమాని
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై… మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
మాయజేసి దాయకు… సోయగాల మల్లెలు
మోయలేని తీయని… హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు… భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు… ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల… అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను… కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు… చలువ సోకి నిలువనీదు
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా, ఆ ఆ
రాసలీలవేళ రాయబారమేల
రాసలీలవేళ… రాయబారమేల
Rasaleela Vela song is from the ( 369) In & English movie.
Rasaleela Vela song was sung by S P Balasubramanyam, S Janaki.
Rasaleela Vela song lyrics were written by Veturi Sundararama Murthy.
Rasaleela Vela song music was composed by Ilayaraja.