
| Movie Name | Swathi Muthyam (1986) |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Kamal Haasan, Radhika |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, SP Sailaja |
| Lyricist | C Narayana Reddy |
| Music Label | Aditya Music Telugu |
రామా కనవేమిరా… రామా కనవేమిరా, ఆ ఆ
శ్రీ రఘురామ కనవేమిరా… రామా కనవేమిరా
రమణీలలామ నవలావణ్యసీమ… ధరాపుత్రి సుమగాత్రి
ధరాపుత్రి సుమగాత్రి… నడయాడి రాగా, రామా కనవేమిరా
సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరూ పదేపదే చూడగా
శ్రీ రామచంద్ర మూర్తి కన్నెత్తి చూడడేమని
అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా… రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా, ఆ ఆఆ… రామా కనవేమిరా
రమణీల లామ నవలావణ్య సీమ, ఆ ఆఆ ఆ
రమణీలలామ నవలావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి… ధరాపుత్రి సుమగాత్రి
నడయాడి రాగా… రామా కనవేమిరా
ముసిముసి నగవుల… రసిక శిఖామనులు
సానిదమ పమగరిస… ఒసపరి చూపుల
ఆసదుశ విక్రములు… సగరిగ మనిదమనిని
ముసిముసి నగవుల… రసిక శిఖామనులు
తాతకిట తకఝణుత… ఒసపరి చూపుల
ఆసదుశ విక్రములు… తకఝణు తకధిమితక
మీసం మీటే రోషపరాయణులు… నీ ద మ ప మ గ రి గా
మాసరి ఎవరను మత్త గుణోల్వణులు, ఆహా
క్షణమే ఒక దినమై… నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి… కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి
ముచ్చెమటలు పట్టిన దొరలు, భూవరులు
తొడగొట్టి ధనువు చేపట్టి
బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి
ముచ్చెమటలు పట్టిన దొరలు, భూవరులు
తొడగొట్టి ధనువు చేపట్టి
బావురని గుండెలు జారిన విభులు
ఆ, గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక… సిగ్గేసిన నరపుంగవులు
తమ ఒళ్ళు ఒరిగి… రెండు కళ్ళు తిరిగి
ఒగ్గేసిన పురుషాఘ్రనులు
ఎత్తే వారు లేరా… ఆ, విల్లు ఎక్కుపెట్టె వారు లేరా
ఆ, ఎత్తే వారు లేరా…. విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
అరరరె, ఎత్తే వారు లేరా… విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహా, ఎత్తే వారు లేరా… విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
తకటతయ్యకు తాధిమితా
రామాయ రామభద్రాయా… రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీద చెయ్యివేసినాడు
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీద చెయ్యివేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
పెళపెళ పెళపెళ పెళపెళ పెళపెళ విరిగెను శివధనువు
కళలొలికెను సీతానవవధువు
జయ జయ రామా… రఘుకుల సోమ
జయ జయ రామా… రఘుకుల సోమ
దశరధ రామా… ధైత్యవిరామ
దశరధ రామా… ధైత్యవిరామ
జయ జయ రామా… రఘుకుల సోమ
జయ జయ రామా… రఘుకుల సోమ
దశరధ రామా… ధైత్యవిరామ
దశరధ రామా… ధైత్యవిరామ
సీతాకళ్యాణ వైభోగమే… శ్రీరామ కళ్యాణ వైభోగమే
సీతాకళ్యాణ వైభోగమే… శ్రీరామ కళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమే… అనగ అనగ రమణీయమే
కనగ కనగ కమనీయమే… అనగ అనగ రమణీయమే
సీతాకళ్యాణ వైభోగమే.. శ్రీరామ కళ్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య…!
రమణీలలామా నవలావణ్యసీమా
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా, ఆ ఆఆ
రామా కనవేమిరా
Rama Kanavemira song is from the Swathi Muthyam movie.
Rama Kanavemira song was sung by S P Balasubramanyam, SP Sailaja.
Rama Kanavemira song lyrics were written by C Narayana Reddy.
Rama Kanavemira song music was composed by Ilayaraja.