
| Movie Name | Intinti Ramayanam |
|---|---|
| Director | Suresh Naredla |
| Star Cast | Vijaya Krishna, Rahul Ramakrishna, Navya Swamy, Surabhi Prabhavathi |
| Music | Kalyani Malik |
| Singer(s) | Deepu, Vaishnavi Kovvuri |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Aditya Music |
Ra Silaka Lyrics in Telugu
రా సిలకా సిరులే ఒలక
సిగురాకుల సిగ్గెనకా
గోరొంక ఎదలో ఇంకా
మొలిసిందొక నెలవంక
కిలకిల నవ్వుల రాక
ఇటు గూటిని చేరాకా
కలకల పువ్వుల కోక
సవరించెనే వేడుక
తొలి ఎన్నెల కన్నులు తెరిచాక
ఈ వాకిట వన్నెలు పరిచాక
ఒక వరసన ప్రేమలు విరిసేనంటా
తళతళ మిలమిల తారల్లాగా
రా సిలకా సిరులే ఒలక
సిగురాకుల సిగ్గెనకా
గోరొంక ఎదలో ఇంకా
మొలిసిందొక నెలవంక
తానూ ఊఊ ఊఊ నేననే
పదములే మారాయిచోట పాటగా
నిన్నటి రాతిరి నిదురలోకన్న
రంగుల కలలతోపాటు
వెచ్చటి ఊపిరి తేలుతూ ఉంది
ఊహల రెక్కల చాటు
అటువైపున్నా ఇటువైపున్నా
విడిపోలేని ఓ నీడలా
అడుగేస్తూ ఉంటే జాడలా
ఆ టెన్ టు ఫైవ్ పంచప్రాణంలా
పదపద పదపద నడిపించంగా
సేనూ ఊఊ ఊ సెరువులా
ముడి పడి ఉంది ఈ బంధం చక్కగా
చల్లటి గాలులు మోసుకొస్తుంటే
అల్లరి ముచ్చట బాగా
మెల్లగ ఊయల ఊగుతు
ఎంత అల్లుకుపోయెను తీగ
ఆ మొన్నల్లా ఈ నిన్నల్లా
కరిగే కాలం ఓ వెన్నెలా
చెయ్ చాచింది ఈ మన్నులా
ఆ మిన్ను అందేలా
గలగల జలజల చినుకుల్లాగా
Raa Silaka song is from the Intinti Ramayanam movie.
Raa Silaka song was sung by Deepu, Vaishnavi Kovvuri.
Raa Silaka song lyrics were written by Kasarla Shyam.
Raa Silaka song music was composed by Kalyani Malik.