
| Movie Name | Skylab |
|---|---|
| Director | Vishvak Khanderao |
| Star Cast | Nithya Menen, Satyadev |
| Music | Prashanth R Vihari |
| Singer(s) | Sean Roldan |
| Lyricist | Sanapati Bharadwaj Patrudu |
| Music Label | Aditya Music |
డ్యావ్ డ్యావ్ డ్యావ్ డ్యావ్
రార లింగ రారా లింగా
కథ సెబుతా ఖచ్చితంగా
డ్యావ్ డ్యావ్ డ్యావ్ డ్యావ్
రారా లింగా రామ లింగా
ఇనుకోరా సుబ్బరంగా
డ్యావ్ డ్యావ్ డ్యావ్ డ్యావ్
పైకి సూత్తే ఎంతో సురుకు
లోన మాత్రం లేదు సరుకు
ఊరు మొత్తం ఇంతేనయ్యో
తళుకు బెళుకు…
ఆహా ఏమి ఊరు… సిత్రం దీని తీరు
దిత్తా దీంత… తననన దిత్తా దీంత
తననన దిత్తా దీంత… తానేనా
అట్టా ఎట్టా కూతలు కూస్తారంట
కోతలు కోస్తారంటా అన్నింటా
అడ్డం తిరిగిన కథని సూస్తూ
అసలు కదలక ఉందురు
కల్లో రయ్యని ఉరకలేస్తూ
అలుపు అలుపని అందురు
బొక్కబోర్లా పడినా దర్జాగా లేచినా
దాన్నో ఆసనమందురు, ఓహో
ఆహా ఏమి ఊరు… సిత్రం దీని తీరు, ఓ ఓ
సుత్తి కొడుతూ కొడుతూ ఉంటారే
నెత్తి పగిలే వరకు అంతేలే
కత్తి పదును తమదే అంటారే
ఉత్తి పగటి కలలే కంటారే
ఎగిరెగిరి పడుతూ ఎగుడుదిగుడుల
దారి తమదని తెలుసుకొనరే
ఆ నింగి నేల మాదే మాదే
అంటారే గాని అంతా సోదే
లోనున్న ఆశ పోనేపోదే
అలవాటులో పొరపాటుగా
మెలికేయదా మరి మనిషి బతుకే
ఆ ఆ ఆహా ఏమి ఊరు
సిత్రం దీని తీరు
ఆహా ఏమి ఊరు
సిత్రం దీని తీరు
Ra Ra Linga song is from the Skylab movie.
Ra Ra Linga song was sung by Sean Roldan.
Ra Ra Linga song lyrics were written by Sanapati Bharadwaj Patrudu.
Ra Ra Linga song music was composed by Prashanth R Vihari.