
| Movie Name | Bucchinaidu Kandriga (2020) |
|---|---|
| Director | Krishna Poluru |
| Star Cast | Munna, Drishika Chander, Ravi Varma |
| Music | Mihiraamsh |
| Singer(s) | Sai Charan |
| Lyricist | Battu Vijay Kumar |
| Music Label | Aditya Music |
పద పద పదమని… అడుగులు కదిలెను
చెలి నిను కలవగా ఇప్పుడే…
ఎపుడెపుడెపుడని అడిగెను… యద సడి
మన కధ ఇక మొదలెప్పుడే…
ప్రియతమా హృదయమే… కుదురుగా ఉండదే
పద పద- పదమని పరుగు… నీ వైపుకే
నువ్వే ఎదురుగ ఉంటె… మనసున ఏదో తెలియని సంతోషం
నువ్వే కనబడుతుంటే కనులకు… కలలే నిజమౌ సంబరం
ప్రియవరము, కలవరము… కలగలిసే భావం
పరవశము, అతిశయము… ఇపుడిక నా సొంతం
ప్రియతమా హృదయమే… కుదురుగా ఉండదే
పద పద- పదమని పరుగు… నీ వైపుకే
క్షణమే నువ్వు కనబడవో… దిగులే ప్రతి యదసడిలో
అసలే ఇక తోచదులే… ఏంటో ఈ మాయే
నువ్వే అని అనుకొని ఎవ్వరినో… నువ్వే అని పొరబడుతూ
పిలిచే పొరపాటే అలవాటైపోయిందే…
చూస్తే నలుదిశలలో… అటుఇటు లోకం
ప్రతి అణువణువు… ప్రేమే కనిపించే కనికట్టేంటిలా
ప్రియవరము, కలవరము… కలగలిసే భావం
పరవశము, అతిశయము… ఇపుడిక నా సొంతం
ప్రియతమా హృదయమే… కుదురుగా ఉండదే
పద పద- పదమని పరుగు… నీ వైపుకే
Priyathama Hrudhayame song is from the Bucchinaidu Kandriga movie.
Priyathama Hrudhayame song was sung by Sai Charan.
Priyathama Hrudhayame song lyrics were written by Battu Vijay Kumar.
Priyathama Hrudhayame song music was composed by Mihiraamsh.