
| Movie Name | Guvva Gorinka |
|---|---|
| Director | Mohan Bammidi |
| Star Cast | Satyadev, Priyaa Lal |
| Music | Suresh Bobbili |
| Singer(s) | Sai Charan, Nutana Mohan |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Mango Music |
ప్రేమ తొలిగా తెలిసెను.. నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను… నిన్నే చూసిందే
మాటే వినబడి… ఎదలో జొరబడి
ఆగిన ఆశనే కదిపేను… కదిపేను
నాకే కనపడి… అడుగుల అలజడి
తొలిగా మౌనమే పలికెను… పలికెను
నే ఒంటరినే, నా లోకమిదే…
నా మనసుకే తాకిన… వరము నువ్వా
ప్రేమ తొలిగా తెలిసెను.. నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను… నిన్నే చూసిందే
ఒకటై నడిచే ఒక దారే నీవే.. అడుగై పిలిచే గమ్యం నీవే
కరిగే దూరం మన ఇరువురి మధ్య… చనువిక పెరిగే
ఒకటే ప్రాణం… ఇరు గుండెల్లో
రాయని కవితే… మనసుని కుదిపే
మదికిదే మరోజన్మ…
చూడని చెలిమే… గతమును చెరిపే
తెలియదే ఇదే ప్రేమా..!
నే ఒంటరినే, నా లోకమిదే…
నా మనసుకే తాకిన… వరము నువ్వా
ప్రేమ తొలిగా తెలిసెను.. నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను… నిన్నే చూసిందే
విడిగా విరిసే… ఇరు ఆశల ఊసే
ఒకటై చూపే జతగానే నిలిపే…
కనులే భారం… మన కబురుల బరువు కలలలో మోసి
నిదురే నేరం అయ్యే వేళల్లో…
దాగని దిగులే… చెదరగ మదికే ఎదురయ్యేదెపుడమ్మా
ఓపని వెలుగే, కనులకి తగిలే… క్షణముకై వేచే ఉన్నా
నే ఒంటరినే, నా లోకమిదే…
నా మనసుకే తాకిన… వరము నువ్వా
ప్రేమ తొలిగా తెలిసెను.. నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను… నిన్నే చూసిందే
(నీవల్లే నిలిచెను… చూసిందే)
Prema Tholiga Thelisenu song is from the Guvva Gorinka movie.
Prema Tholiga Thelisenu song was sung by Sai Charan, Nutana Mohan.
Prema Tholiga Thelisenu song lyrics were written by Krishna Kanth.
Prema Tholiga Thelisenu song music was composed by Suresh Bobbili.