
| Movie Name | HIT 2 |
|---|---|
| Director | Dr. Sailesh Kolanu |
| Star Cast | Adivi Sesh, Meenakshi |
| Music | Suresh Bobbili |
| Singer(s) | Sailesh Kolanu |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Saregama Telugu |
ఏ, రక్తమే అంటుకున్న చేతులా
ఎంతకీ వదిలిపోని మరకలా
నిదురలో పోనేపోని చేదు గురుతులా
కంచెలే ఉన్నా… అన్ని వైపులా
తెంచుకుంటూ పోనీకు నువ్వే కాపలా
తారలే తొక్కుతున్న… రెండు భుజములా
పడగలే విసిరితే
నేరమే పైకి పైకి దూకితే
సమరమే మొదలయే
నువ్ బిగించు… ఉక్కు పిడికిలే
అసురులే తరిమితే
చేతకాక వాల్ల చేత చిక్కి ధర్మమే
దారులే తప్పితే
తప్పదింక దూయి కత్తులే
పోరాటమే పోరాటమే
నీ జీవితమొక పోరాటమే
పోరాటమే పోరాటమే
(ఓడిపోకు సోదరా)
పోరాటమే పోరాటమే
నీ జీవితమొక పోరాటమే
పోరాటమే పోరాటమే
(సాగించారా)
యే, బతుకుతుంది ధైర్యమే
నిన్ను చూసి కాదా
ఖాకి రంగు చూసి
చీకటైన బెదిరిపోదా
నువ్వు మేలుకుంటే
లోకమంత నిదురపోద
ఆవలిస్తే దేనినైనా
పట్టి తెచ్చే శోదనేరా
చట్టముంది చెడుని మట్టుపెట్టడానికేరా
కట్టుబాటు కన్ను ఎర్రజేస్తే హడలిపోరా
వెధవలంత నీ బూటుకింద అణిగిపోరా
రక్షకా జాతికింక నువ్వే నేడు రక్షరా
అడుగుకో ఆపదే ఆపదా
వచ్చినా సూటిగా నువ్ పద
నీకు దారి నీ అస్త్రమే
చూపదా ఓటమాపదా
కాఠిన్యం కత్తులే దూయదా
పాతాళం లోనికే తొయ్యదా
తూటాల దూసుకుంటు వెళ్లరా
వెళ్లరా వెళ్లరా, హో
చూస్తూనే అక్రమాలు ఉండిపోక
ఏనాడు వెన్ను చూపి పారిపోక
కష్టాలే తీరిపోని ముల్లబాట నీదిరా, హా
నీపైనే అంచనాలే నింగిదాక
అధికారం చేతికిస్తె పొంగిపోక
ఏమైనా కుంగిపోక లొంగిపోక చెయ్యరా
పోరాటమే పోరాటమే
నీ జీవితమొక పోరాటమే
పోరాటమే పోరాటమే
(ఓడిపోకు సోదరా)
పోరాటమే పోరాటమే
నీ జీవితమొక పోరాటమే
పోరాటమే పోరాటమే
(సాగించారా)
ఏ, రక్తమే అంటుకున్న చేతులా
ఎంతకీ వదిలిపోని మరకలా
నిదురలో పోనేపోని చేదు గురుతులా
కంచెలే ఉన్నా… అన్ని వైపులా
తెంచుకుంటూ పో నీకు నువ్వే కాపలా
తారలే దూకుతున్న… రెండు భుజములా
Poratame 2 song is from the HIT 2 movie.
Poratame 2 song was sung by Sailesh Kolanu.
Poratame 2 song lyrics were written by Krishna Kanth.
Poratame 2 song music was composed by Suresh Bobbili.