Pillagali Allari Song Lyrics - Athadu

Pillagali Allari Song Lyrics: Pillagali Allari is a Telugu song from the film Athadu starring Mahesh Babu, Trisha, directed by Trivikram. "Pillagali Allari" song was composed by Mani Sharma and sung by Shreya Ghoshal. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Pillagali Allari Song Details

Movie NameAthadu
DirectorTrivikram
Star CastMahesh Babu, Trisha
MusicMani Sharma
Singer(s)Shreya Ghoshal
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Movies

Pillagali Allari Song Lyrics in Telugu

ఆ ఆ ఆ ఆ ఆ…

పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి

నల్లమబ్బు ఉరిమేనా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి

నల్లమబ్బు ఉరిమేనా

కళ్ళెర్ర చేసి… మెరుపై తరిమెనా

ఎల్లలన్నీ కరిగి… జల్లుమంటు ఉరికి

మా కళ్ళలో వాకిళ్ళలో

వేవేల వర్ణాల వయ్యారి జాన

అందమైన సిరివాన

ముచ్చటగా మెరిసే సమయాన

అందరాని చంద్రుడైనా

మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

మౌనాల వెనకాలా… వైనాలు తెలిసేలా

గారంగా పిలిచేనా..!!

ఝల్లుమంటూ గుండెలోన

తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా

మౌనాల వెనకాలా… వైనాలు తెలిసేలా

గారంగా పిలిచేనా, ఆ ఆ

ఝల్లు మంటూ గుండెలోన

తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా

ఇంద్ర జాలమై వినోదాల సుడిలో

కాలాన్ని కరిగించగా

చంద్రజాలమై తారంగాల ఒడిలో

ఏళ్ళన్ని మురిపించగా, ఓ ఓ

తారలన్ని తోరణాలై

వారాల ముత్యాల హారలయ్యేనా

చందనాలు చిలికేనా

ముంగిలిలో నందనాలు విరిసేనా

అందరాని చంద్రుడైనా

మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లో హాయి రాగం

మువ్వల్లో వాయు వేగం

ఏమైందో ఇంత కాలం

ఇంతమంది బృందగానం

ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం

ఓ, నవ్వుల్లో హాయి రాగం

మువ్వల్లో వాయు వేగం

ఏమైందో ఇంత కాలం

ఇంతమంది బృంద గానం

ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం

పాలవెల్లిగా సంతోషాలు చిలికే

సరదా సరాగాలుగా

స్వాతిజల్లుగా స్వరాలెన్నో పలికే

సరికొత్త రాగాలుగా, ఓ ఓ

నింగి దాక పొంగి పోదా

హోరెత్తి పోతున్న గానా బజానా

చెంగు మంటూ ఆడేనా చిత్రంగా

జావలీలు పాడేనా

అందరాని చంద్రుడైనా

మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

Share this Song!

More Songs from Athadu Movie

  1. Neetho Cheppana Song Lyrics
  2. Pilichina Ranantava Song Lyrics
  3. Pillagali Allari Song Lyrics

Pillagali Allari Song FAQ

What movie is Pillagali Allari song from?

Pillagali Allari song is from the Athadu movie.

Who sang Pillagali Allari song?

Pillagali Allari song was sung by Shreya Ghoshal.

Who wrote Pillagali Allari song lyrics?

Pillagali Allari song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Pillagali Allari song?

Pillagali Allari song music was composed by Mani Sharma.