Movie Name | Love Failure Songs (2025) |
---|---|
Director | Djshiva Vango |
Star Cast | Djshiva Vangoor & Vedha Ponnam |
Music | Madeen SK |
Singer(s) | Djshiva Vangoor |
Lyricist | Djshiva Vangoor |
Music Label | Djshiva Vangoor |
నీ ఎయిలు పట్టుకున్న వాడేనా
ఏరి కోరి కట్టుకునేదీ
వీడిపోను అన్న నీ ప్రేమేనా
వీడుకోలు పలికిందీ
కారుమబ్బులన్ని కలిసి ఒక్కటయ్యి
మీద వడ్డట్టు ఉందే
ప్రేమ బాసలన్ని గుండుసూదులయ్యి
గుచ్చుతున్నట్టు ఉందే
ఓనమాలు రాసిననాడే
ఒక్కటైనమన్నావు గానే
ఊహలన్ని తెలిసిన నాడే
వద్దు అన్న బాగుండు గానే
ఇంతలోనే ఎంత ప్రేమ జూపి
నన్నెంత వంచన జేసినవేమే…
సిన్నదాన ఉన్నదమ్మ
నీ కన్నుల్లోన వెండి వెన్నెల వాన
నంగనాచి ఆటలెన్నో ఆడి
తడిపినవే నీ ప్రేమ వానలోన.
సిన్నదాన ఉన్నదమ్మ
నీ కన్నుల్లోన వెండి వెన్నెల వాన
నంగనాచి ఆటలెన్నో ఆడి
తడిపినవే నీ ప్రేమ వానలోన.
మరిసిపోయినవమ్మ నన్ను
ఇడిసి ఉండలేనమ్మ నిన్ను
తోడులేక నా దారిలోనే
మాటరాక మూగబోయానే
కన్నపేగు కాదన్న నన్ను
వీడలేదే నా ప్రేమ నిన్ను
నేరమేమి చేసానే నేను
నిందలేసి ఎల్లిపోయావు
కారుచీకట్లన్ని కలిసి ఒక్కటయ్యి
కళ్ళు పొడిసినట్టుందే
గుండె లోతుల్లోని ప్రేమ గురుతులన్ని
గుచ్చి సంపుతు ఉందే
ఒట్టులెన్నో పెట్టావు గానే
వగలు పలుకుకుంట వయ్యారి భామ
ఒట్టులెన్నో పెట్టావు గానే
వగలు పలుకుకుంట వయ్యారి భామ
పంచప్రాణాలన్ని పంచుకున్న నాడు
పెంచుకున్న ప్రేమ తెంచెళ్ళి పోతు
పల్లకిలో పుత్తడిబొమ్మ
కన్నీళ్ళు వెడుతున్నవె ఎందుకమ్మ
వేయి వర్ణాల వన్నెల బొమ్మ
మాటరాక మూగబోయినవేమ్మా
పల్లకిలో పుత్తడిబొమ్మ
కన్నీళ్ళు వెడుతున్నవె ఎందుకమ్మ
వేయి వర్ణాల వన్నెల బొమ్మ
మాటరాక మూగబోయినవేమ్మా