
| Movie Name | Ninne Premista (2025) |
|---|---|
| Director | |
| Star Cast | Nagarjuna, Soundarya |
| Music | R.P.Patnaik |
| Singer(s) | Hariharan |
| Lyricist | samavedam |
| Music Label | Aditya Music |
ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
విరిసె వెన్నెల్లోన మెరిసె కన్నుల్లోన నీనీడే చూసానమ్మ
ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగపోసి
పూయించా నీజడకోసం
రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
భూజించా నీ జతకోసం
నీరెండకు నీవెంటే నీడై వచ్చి
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి
ఆశలతో నీ వలుపుకు హారతులిస్తా
ఇన్నాల్లు అనుకోలె నిన్నే ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని
Oka Devata song is from the Ninne Premista movie.
Oka Devata song was sung by Hariharan.
Oka Devata song lyrics were written by samavedam.
Oka Devata song music was composed by R.P.Patnaik.