| Movie Name | Palasa (1978) |
|---|---|
| Director | Karuna Kumar |
| Star Cast | Rakshit, Nakshatra |
| Music | Raghu Kunche |
| Singer(s) | S P Balasubrahmanyam, Pasala Baby |
| Lyricist | Lakshmi Bhupala |
| Music Label | Aditya Music |
ఓ సొగసరి ప్రియలాహిరి… తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి… పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు… వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేం మరి..!
వస్తే ముద్దంటావు… హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు… పోవోయ్ మరీ
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
చలివేళలో చెలి ఏలనే… సొగసుకు బిడియపు ముసుగూ
ఈ వేళలో ఆగావని… అతిగా ప్రణయం విసుగు
విరహమంటాను నేను… కసురుకుంటావు నువ్వు
సరసమే లేదు సయ్యాటలో…
నేను వింటూనే ఉంటే… ఏదో అంటావు నువ్వు
నీతో తంటాలు సిగ్గాటలో..!!!
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
చెలి కురులలో జలపాతమే… తనువొక ధనువై మెరుపూ
ప్రణయాలలో ఈ మాటలే… మనసుకు ముచ్చటగొలుపు
వెండి వెన్నెల్లొ నువ్వు… నిండు జాబిల్లి నవ్వు
కన్నెచెక్కిళ్ళు నా కోసమే…
ఎంతసేపంటు నన్ను… పొగుడుతుంటావు నువ్వు
ఆపు చాలింక నచ్చావులే…
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
ఓ సొగసరి ప్రియలాహిరి… తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి… పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు… వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేంమరి..!
వస్తే ముద్దంటావు… హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు… పోవోయ్ మరీ
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
అహ్హహ హహ్హ అహ్హహ… ఒహ్హోహ్హో ఓహోహో ఒహ్హోహ్హో
Other Songs Lyrics of Palasa 1978 Cinema
O Sogasari song is from the Palasa movie.
O Sogasari song was sung by S P Balasubrahmanyam, Pasala Baby.
O Sogasari song lyrics were written by Lakshmi Bhupala.
O Sogasari song music was composed by Raghu Kunche.