
| Movie Name | Atithi Devo Bhava |
|---|---|
| Director | Polimera Nageshwar |
| Star Cast | Aadi Sai Kumar, Nuveksha |
| Music | Shekar Chandra |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Sony Music South |
నిన్ను చూడగానే నా గుండె జారిందే
ఉన్న ఒక్క ప్రాణం నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే కాలం ఆగిందే
ఉన్నట్టుండి లోకం అందంగా మారిందే
ఒక నవ్వే కదా… ఒక చూపే కదా
ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా
నువ్వేలే నా శ్వాస
నువ్వేలే నా ధ్యాస
నీతో కలిసి బ్రతకాలన్నది
నాదో చిన్న ఆశ
నీలో నన్ను చూశా
నాలో నిన్ను మోశా
అవునన్నా నువ్వు కాదన్నా
నా మనసే నీకిచ్చేశా
పూట పూట గుర్తొస్తున్నావే
నీటి మీద నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే
నూటికి నూరుపాళ్ళు నచ్చేస్తున్నావే
ఈ జన్మ నీతోనే
మరుజన్మ నీతోనే
వచ్చి వచ్చి గుండెల్లోన
వాలిపోవే గువ్వలా
నువ్వేలే నా ఆట
నువ్వేలే నా పాట
నువ్వుంటేనే సంతోషాన్ని
వెయ్యలేను కాటా
నువ్వే ఉన్న చోట
కాదా పూల తోట
హృదయం మొత్తం రాసిచ్చేస్తా
నాకేం వద్దు వాటా
Ninnu Chudagane song is from the Atithi Devo Bhava movie.
Ninnu Chudagane song was sung by Anurag Kulkarni.
Ninnu Chudagane song lyrics were written by Bhaskara Bhatla.
Ninnu Chudagane song music was composed by Shekar Chandra.