| Movie Name | Atithi Devo Bhava (2022) |
|---|---|
| Director | POLIMERA NAGESHWAR |
| Star Cast | Aadi Sai Kumar, Nuveksha |
| Music | SHEKARCHANDRA |
| Singer(s) | SID SRIRAM , NUTANA MOHAN |
| Lyricist | BHASKARA BHATLA |
| Music Label | Sony Music |
బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే
బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న
కాటుకంతా ఒంటికంటితే
అహహహా బాగుంది వరస
నీ మీద కోపం ఎంతుందో తెలుసా
లాలిస్తే తగ్గిపోతుంది బహుశా
ఈ మనసు ప్రేమ బానిస
అయితే బుజ్జగించుకుంటానే
నిన్నే నెత్తినెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలి చూపవే
తడి చేసేద్దాం పెదవులని
ముడి వేసేద్దాం మనసులని
దాచేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయిని
కాదంటానేంటి చూస్తూ నీ చొరవ
వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ
నీ నుంచి నేను తప్పుకోవడం సులువా
కౌగిళ్ళలోకి లాగవా
అమ్మో నువ్వు గడుసు కదా
అన్నీ నీకు తెలుసు కదా తెలుసు కదా
అయినా బయటపడవు కదా పడవు కదా
పదపదా ఎంతసేపిలా
వెలివేసేద్దాం వెలుతురుని
పరిపాలిద్దాం చీకటిని
పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమని
నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చిందరవందరలు
అందంగా సర్దుతూ నా ముంగురులు
మూసావు అన్ని దారులు
కొంచెం వదిలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవా వెన్నెలా
వేరే దారి లేక నేనిలా
బంధించానే అన్ని వైపులా
బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే