
| Movie Name | & English - Cheli |
|---|---|
| Director | Gautham Menon |
| Star Cast | Madhavan, Abbas, Reema Sen |
| Music | Harris Jayaraj |
| Singer(s) | Harini & Unni Krishnan |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label |
నింగికి జాబిలి అందం… నేలకి తొలకరి అందం
నీ కనుచూపులు సోకటమే ఆనందం
బొమ్మా బొరుసుల చందం… విడిపోనిది మన బంధం
కమ్మని కలల గోపురమీ… అనుబంధం, అనుబంధం
ఓఓ హో హో ఓ ఓ, మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా
మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా
ఇతడెవరో ఇతడెవరో… వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు… దేనిని కోరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా… తడబడి పోతున్నా
ఇది వలపు కథో, వయసు వ్యధో… తెలియక నించున్నా
ఇతడెవరో ఇతడెవరో… వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు… దేనిని కోరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా… తడబడి పోతున్నా
ఇది వలపు కథో, వయసు వ్యధో… తెలియక నించున్నా
వయసుని తట్టి, మనసుని పట్టే… ముద్దుల జాబిల్లి
పోకే చెలియా నన్నొదిలి
నవ్వులు రువ్వి, పువ్వులు రువ్వి… ఆడకె దిల్వాలి
చెవిలో పాడకె కవ్వాలి
మనసా మనసా నిన్నూ… మదిలో దాచినదెవరో, ఓ ఓ
నా ఎదలోనే ఉంటూ… నన్నే దోచినవారే
వారెవరో వారెవరో… వచ్చినదెందుకనో
ఎదలోనే ఎదలోనే దాగినదెందుకనో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా… తడబడి పోతున్నా
ఇది వలపు కథో, వయసు వ్యధో… తెలియక నించున్నా
అరె తికమక పడుతున్నా..!!
సొగసరి గువ్వ, సొగసరి గువ్వ… తడబాటెందులకే
వలపుల దాహం తీర్చవటే
మనసును మోహం కమ్ముకు వస్తే… మౌనం వీడవటె
మదనుడి సాయం కోరవటే
ఏమో ఏమో నన్నూ… ఏదో చేసావులే, ఏ ఏ
నేను నీకు చేసిందేదో… నువ్వే నాకు చేసావే బొమ్మా
నీవెవరో నీవెవరో… వచ్చినవెందుకనో
నావెనకే పడ్డావు… ఊఁహూఁ హూఁ
నేనేలే నీకోసం… వచ్చా మనసారా
నా ఎదని నీకోసం పరిచా ప్రియమారా
ఎమైందో నాకే తెలియదులే… నామనసు నిన్నే వీడదులే (నిన్నే వీడదులే)
అరె ఎందుకిలా ఎందుకిలా… జరిగెనె ప్రాణసఖి
ఇది వలపు కథో వయసు వ్యధో… తెలుపవే చంద్రముఖి
కథ తెలుపవే చంద్రముఖీ… కథ తెలుపవే చంద్రముఖీ
కథ తెలుపవే చంద్రముఖీ… చంద్రముఖీ చంద్రముఖీ చంద్రముఖీ
Ningiki Jabili Andam song is from the & English - Cheli movie.
Ningiki Jabili Andam song was sung by Harini & Unni Krishnan.
Ningiki Jabili Andam song lyrics were written by Bhuvana Chandra.
Ningiki Jabili Andam song music was composed by Harris Jayaraj.