
| Movie Name | & English - Dear Uma |
|---|---|
| Director | Sai Rajesh Mahadev |
| Star Cast | Sumaya Reddy, Pruthvi Ambaar |
| Music | Radhan |
| Singer(s) | Ram Miriyala, Sarath Santosh |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
నీవెవ్వరో, నీవెవ్వరో
నా కలల వెన్నెలగా నిను కలిపిందెవరో
చీకటిలో వేకువలో
నా జతే నువు లేకుంటే తోడెవరో, తోడెవరో
అణువణువూ నీ మహిమే
అడుగడుగిది నీ బలమే
ప్రతి కదలిక నీ వరమే
ఇది నిజమే నువు నా స్వరమే
అంకితం నీకే ఈ గీతం
అంకితం నా సంగీతం
అందుకో చెలియా ఈ గీతం
తరగని ప్రేమకు సంకేతం
గాలులే తడిమినా
పువ్వుల చెమ్మే ధన్యం
బదులుగా సౌగంధమే
గాలులకు తొలి నైవేధ్యం
అంకితం నీకే ఈ గీతం
అంకితం నా సంగీతం
అందుకో చెలియా ఈ గీతం
తరగని ప్రేమకు సంకేతం ||2||
ఏ కనుచూపులో ఏ వెలుగున్నదో
నీ చూపు నాలోన ఏం కనుగొన్నదో
(ఏం కనుగొన్నదో)
నీ కనుపాప నా కొరకై ఏం కలగన్నదో
(ఏం కలగన్నదో)
ఆ కలే ప్రేమగా నా కధను నడిపిస్తుందో
చిగురంత నీ దయ వల్లే
బతుకంత మారినదే
చివరంట నీతో చెలిమే
నా మనసు కోరినదే
అంకితం నీకే ఈ గీతం
అంకితం నా సంగీతం
అందుకో చెలియా ఈ గీతం
తరగని ప్రేమకు సంకేతం ||2||
నీవెవ్వరో, నీవెవ్వరో
నా కలల వెన్నెలగా నిను కలిపిందెవరో
చీకటిలో వేకువలో
నా జతే నువు లేకుంటే తోడెవరో, తోడెవరో
అణువణువూ నీ మహిమే
అడుగడుగిది నీ బలమే
ప్రతి కదలిక నీ వరమే
ఇది నిజమే నువు నా స్వరమే
అంకితం నీకే ఈ గీతం
అంకితం నా సంగీతం
అందుకో చెలియా ఈ గీతం
తరగని ప్రేమకు సంకేతం
(తరగని ప్రేమకు సంకేతం)
అంకితం నీకే ఈ గీతం
అంకితం నా సంగీతం
అందుకో చెలియా ఈ గీతం
తరగని ప్రేమకు సంకేతం ||2||
Watch నీవెవ్వరో Lyrical Video
Neevevaro song is from the & English - Dear Uma movie.
Neevevaro song was sung by Ram Miriyala, Sarath Santosh.
Neevevaro song lyrics were written by Ramajogayya Sastry.
Neevevaro song music was composed by Radhan.