Nammave Ammayi Song Lyrics - & English - Vasu

Nammave Ammayi Song Lyrics - & English - Vasu
Nammave Ammayi Song Lyrics: Nammave Ammayi is a Telugu song from the film & English - Vasu starring Venkatesh, Bhoomika, directed by A. Karunakaran. "Nammave Ammayi" song was composed by Harris Jayaraj and sung by Raghavendra & Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Nammave Ammayi Song Details

Movie Name& English - Vasu
DirectorA. Karunakaran
Star CastVenkatesh, Bhoomika
MusicHarris Jayaraj
Singer(s)Raghavendra & Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Nammave Ammayi Song Lyrics in Telugu

నమ్మవే అమ్మాయి… తరించిపోయే చేయి

ఇలాంటి హాయి… మొదటిసారి సొంతమై

నమ్మవే అమ్మాయి… తరించి పోయే చేయి

ఇలాంటి హాయి… మొదటిసారి సొంతమై

హాయి మిగిలిపోయి… మనస్సు జారిపోయి

నిన్నొదిలి రాను అంది నన్ను మరచిపోయి

దేహమంత మారిపోయే చేయిగా

కాలమంత కాలుతోంది తియ్యగా

మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి

ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై

హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి

నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి

ఓ సారి చెయ్యేస్తే

ఎలా కళ్ళుమూసి… ఒళ్ళు మరచిపోతే

నువు గనుక నేనయితే

నువ్వే చెప్పగలవు… ఏమి జరిగనంటే

ఇలాగ వేలుతాకి… అలాగ సోలిపోతే

నువ్వేమిటౌదువో మరింత ముందుకొస్తే

తుఫాను కాకముందు… చిటుక్కు చినుకు ముద్దు

ఇలాగె మన గుండెల్లోన… ఆవిర్లు రేపి పోదా

నమ్మవే అమ్మాయి, హే ఏ ఏ

చాలులే బడాయి… కవిత్వమా అబ్బాయి

కబుర్లతోనే కాలమంతా గడపకోయి

ఇంతకన్న హాయి… కావాలా ఆకతాయి

అందించగలను చేతిలోన చెయ్యి

హో, ఇన్నాళ్లు ఈ గాలి

ఇలా పాడలేదు… ఇంత చిలిపి లాలి

ఇంకేమి కావాలి

సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి

ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను

నీ లేత చేతి స్పర్శ కందిపోవునేమో

మరైతె ఇంక నేను… ఎలాగ తట్టుకోను

నీ వరస చూస్తే ఇంక నువ్వు నన్నైన తాకవేమో

చాలులే బడాయి

హో హో హో హో

నమ్మవే అమ్మాయి… తరించిపోయే చేయి

ఇలాంటి హాయి… మొదటిసారి సొంతమై

హాయి మిగిలిపోయి… మనస్సు జారిపోయి

నిన్నొదిలిరాను అంది… నన్ను మరచిపోయి

దేహమంత మారిపోయే చేయిగా

కాలమంత కాలుతోంది తియ్యగా

మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి

ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై

హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి

నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి

లేనిపోని మైకమింక మానుకో

చేరువైన నన్ను కాస్త చేరుకో

లేకపోతే కోపమొచ్చి మాయమౌత చూసుకోర

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Vasu Movie

  1. Nammave Ammayi Song Lyrics
  2. Vaale Vaale Poddula Song Lyrics
  3. Pataku Pranam Song Lyrics

Nammave Ammayi Song FAQ

What movie is Nammave Ammayi song from?

Nammave Ammayi song is from the & English - Vasu movie.

Who sang Nammave Ammayi song?

Nammave Ammayi song was sung by Raghavendra & Chitra.

Who wrote Nammave Ammayi song lyrics?

Nammave Ammayi song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Nammave Ammayi song?

Nammave Ammayi song music was composed by Harris Jayaraj.