
| Movie Name | Jayamundhi Bhayamela Manasaa |
|---|---|
| Director | Ranjith Pasam |
| Star Cast | Bharan Dandamudi, Saranya Sharma |
| Music | Kalyan Nayak |
| Singer(s) | Haricharan, Ramya Behra |
| Lyricist | Bhargava Karthik |
| Music Label | Sony Music South |
ఓ ఓ ఓ ఓఓ ఓ
నమ్మాలనుంది కాని
నమ్మేంత వీలు లేని వేళా
ఇవ్వాలె పుట్టినట్టు
ఊపిర్లో ఆపలేని గోలా…
ఇన్నేళ్ళ దూరమే ఈ ఆట చాలని
నీ ముందు నన్నిలా తోసే
నిన్నల్లో వేదనా నీ జంట చేరగా
ఈ తీపి రాగమై పాడే…
పరుగాపని పసిపాదపు తీరై
ఉరికే మనసా, ఏంటీ వరసా
ఎద లోపలి మొహమాటపు మాటే
వినవా సరిగా, నా జతగా…
కాలం ఆగేనా… తోడుగా
నమ్మాలనుంది కాని
నమ్మేంత వీలు లేని వేళా
ఇవ్వాలె పుట్టినట్టు
ఊపిర్లో ఆపలేని గోలా…
మనసా… మనసా
మనసా… మనసా
మనసా మనసా, మనసా
తెలియని బిగువో… తేలని తగువో
తెరమరుగయ్యే భాషా
గతమున కధనే స్వాగతమనగా
బ్రతుకున విరిసే ఆశా
నేనెదురు చూసే నీవై
నీ ఎదుటనున్నా ఆ
ఈ క్షణము నీదే రాసా
నా నుదుటి పైనా ఆ ఆ…
వందేళ్లు చాలవే
వెయ్యేళ్ళు చిన్నవే
ఈ హాయి మోయదే ప్రాణం
వేవేల గొంతుకై మౌనాలు మోగగా
ఈ జన్మ నేటితో ధన్యం
ఇది చాలని ఇక మీదట ఏదీ
అడిగే చొరవా లేదే మనసా
దరిదాపుగ చెరి సగమై పోయే
చెలిమిది తెలుసా?
మ్, బహుశా…!
ఓ ఓ ఓ
ఆ ఆ ఆ.
Nammalani Undi Kaani song is from the Jayamundhi Bhayamela Manasaa movie.
Nammalani Undi Kaani song was sung by Haricharan, Ramya Behra.
Nammalani Undi Kaani song lyrics were written by Bhargava Karthik.
Nammalani Undi Kaani song music was composed by Kalyan Nayak.