
| Movie Name | Donga Mogudu |
|---|---|
| Director | A. Kodandarami Reddy |
| Star Cast | Chiranjeevi, Bhanupriya, Madhavi, Raadhika |
| Music | Chakravarthy |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
ఏ హే హే, ఏ ఏఏ ఏ హే
ఓహో హో ఓ ఓ, ఆఆ ఆ ఆ
నల్లంచు తెల్లచీర… ఓఓ
తల్లోన మల్లెమాలా… ఓ ఓ
ఈడెక్కి కవ్వించితే భామా… వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే, హొయ్
బుగ్గల్లో సిగ్గులూర ఒహొ… చూడొద్దు తేరిపారా, ఒహొ
కోరేవు మోమాటము, రాజా… రేపేవు ఆరాటమూ
విరితూపుల జడిలో పడి… వసివాడేను సొగసే, హొయ్
సాగే వన్నెవాగే… నన్ను కమ్మేసిందిరో
ఊగే కన్నెలాగే… నన్ను లాగేసిందిరో
మూగే మూగ సైగే… నన్ను ముద్దాడిందిరో
ఊగే తీగలాగే… మేను అల్లాడిందిరో
గాజుల బాజాలతో… జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో… రోజులు ఎదురేగెనే
తనివే తీరని, తనిమే ఊరనీ
జతలో గతులే జతులై
బుగ్గల్లో సిగ్గులూర,
ఒహొ… చూడొద్దు తేరిపారా, ఒహొ
నల్లంచు తెల్లచీర,
ఓఓ… తల్లోన మల్లెమాలా, ఓ ఓ
కాగే ఈడు కోరే… వేడి ఉందీలోయలో
రేగే చల్లగాలే… ముంచుతుంది మాయలో
రాలే మంచుపూలే… పెంచె నాలో దాహము
జాలేలేని చలిలో… దించుతోంది మోహము
కౌగిలి చెరసాలలో… ఈ చలి చిక్కాలిలే
పెదవుల సరసాలలో… కోరిక కరగాలిలే
మరిగే మరులనే… నదులై పారనీ
విరులే జడిసే ఒడిలో… ఎయ్
నల్లంచు తెల్లచీర… ఓఓ
తల్లోన మల్లెమాలా… ఓ ఓ
ఈడెక్కి కవ్వించితే భామా… వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే
గుసగుసగా వలవిసిరే, హొయ్
బుగ్గల్లో సిగ్గులూర
ఒహొ… చూడొద్దు తేరిపారా, ఒహొ
కోరేవు మోమాటము, రాజా… రేపేవు ఆరాటమూ
విరితూపుల జడిలో పడి
వసివాడేను సొగసే, హొయ్
Nallanchu Tella Cheera song is from the Donga Mogudu movie.
Nallanchu Tella Cheera song was sung by S P Balasubramanyam, P Susheela.
Nallanchu Tella Cheera song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nallanchu Tella Cheera song music was composed by Chakravarthy.