
| Movie Name | Donga Mogudu (1987) |
|---|---|
| Director | A. Kodandarami Reddy |
| Star Cast | Chiranjeevi, Bhanupriya, Madhavi, Raadhika |
| Music | Chakravarthy |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
ఈ చెంపకు సెలవీయకు
ఈ పెదవిని వదిలేయకు
చాలని అనకు… రాతిరి మనకు
మోహాలు సంకెళ్ళు విడిపోనీకు, హా య్
ఈ చెంపకు… సెలవీయకు
ఈ పెదవిని… వదిలేయకు
నీ వేళ్ళు చేసే అల్లరి
కుచ్చుళ్ళు పాడే పల్లవి
తుఫాను రేగే ముందర
ముస్తాబు దేనికి దండగ
కంటి చూపు చీర… కట్టాలి ఒంటిని
కంచి పట్టు చీర… జారాలి నేలనీ
ఈ వేడీలో వాడనీ… ఈ గాలినే పూలనీ
గండి పడ్దది నింగి చెరువుకి
వెండి వెన్నెల పొగుతున్నదీ
గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా, హోయ్
ఈ చెంపకు సెలవీయకు
ఈ పెదవిని వదిలేయకు
పై పైకి రాకు… సూర్యుడా
పొద్దంటే మాకు చేదురా
తెల్లారుతున్నా తీరక
అల్లాడుతోందీ కోరికా
కక్షగట్టి వచ్చి… మా తలుపు తట్టకు
గెలుపు వలలు తెచ్చి… మా తలలు పట్టకు
ఈ రేయినీ ఆగనీ… ఈ హాయినీ సాగనీ
పాలపుంతలో పూల వేడుక
కౌగిలింతలో ఇలకు జారగా
తాపాల దాహాలు
తీరిపోయేలా, హోయ్
ఈ చెంపకు సెలవీయకు
ఈ పెదవిని, హు మ్ మ్ హు
చాలని అనకు… ఆ హా, హహ్హా
రాతిరి మనకు… హహ్హా హహ్హా
మోహాలు సంకెళ్ళు విడిపోనీకు, హోయ్
Ee Chempaku Selaveeyaku song is from the Donga Mogudu movie.
Ee Chempaku Selaveeyaku song was sung by S P Balasubramanyam, P Susheela.
Ee Chempaku Selaveeyaku song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Ee Chempaku Selaveeyaku song music was composed by Chakravarthy.