
| Movie Name | Theppa Samudram |
|---|---|
| Director | Sateesh Rapolu |
| Star Cast | Chaitanya Rao, Arjun Ambati, Kishori Dhatrak |
| Music | PR |
| Singer(s) | Penchal Das |
| Lyricist | Penchal Das |
| Music Label | MRT Music |
నా నల్ల కలువపువ్వా
ఎండు మెరుపుల చాపాపిల్ల
ఎదురూ చూపుల వేళా ఏమైనావో
ఏ మబ్బు కమ్మీనాదో
ఏ మిత్తవ మింగీనాదో
ఏ కామపు కోరకే ఆహుతైనావో
అరచేతుల పెంచీ
ఆదమరచినామమ్మా
శశి గ్రుంకీ బ్రతుకు నిశి ఆవరించింది
సుక్క మునిగిన జాము
శీత గాలి తగిలింది
కల చెదిరి కన్నీరై శోకమే మిగిలింది
మోడైనా బ్రతుకులో
కొత్త చిగురు నీవవ్వా
మా నీడవు నువ్వమ్మా
మా వెలుగు జాడవే
ఆడ పుటక కంటే
అడవిలో మాను మేలని
ఆడేటి మాటలకు రుజువైనావమ్మ
పూల తీగకు ఊలు దారాల ఉరివేసి
వేడుక సూసేటి ఈ కఠిక లోకంలో
పగబట్టి పసిమొగ్గాల శిదిమేసే నీచులను
నెత్తురులు ఆరబోసి నల్లా జీమల పాల్ జేస్తే
కన్న కడుపులు కాలాకుండా
ఇంత దుఃఖం ఓర్చేదెవరు
ఆడదంటే అమ్మేరా
నిమ్మాల నీడేరా
కన్న కడుపులు కాలాకుండా
ఇంత దుఃఖం ఓర్చేదెవరు
ఆడదంటే అమ్మేరా
నిమ్మాల నీడేరా
నా నల్ల కలువపువ్వా
ఎండు మెరుపుల చాపాపిల్ల
ఎదురూ చూపుల వేళా ఏమైనావో
ఏ మబ్బు కమ్మీనాదో
ఏ మిత్తవ మింగీనాదో
ఏ కామపు కోరకే ఆహుతైనావో
Watch నా నల్ల కలువపువ్వా Video
Naa Nalla Kaluvapuvvaa song is from the Theppa Samudram movie.
Naa Nalla Kaluvapuvvaa song was sung by Penchal Das.
Naa Nalla Kaluvapuvvaa song lyrics were written by Penchal Das.
Naa Nalla Kaluvapuvvaa song music was composed by PR.