
| Movie Name | Miss India (2020) |
|---|---|
| Director | Narendra Nath |
| Star Cast | Keerthy Suresh, Jagapathi Babu, Naveen Chandra |
| Music | Thaman S |
| Singer(s) | Aditi, Ramya Behra & Sri Krishna |
| Lyricist | Neeraja Kona |
| Music Label | Aditya Music |
నా చిన్ని లోకమే… చేజారిపోయెనే
నా కలల వెలుగులే… అదృశ్యమాయెనే
తారాల తీరమే… దూరంగా మెరిసెనే
రాగాల కోయిలే… గానాన్నే మరిచెనే
ఎదురుగా మొలిచిన… ప్రశ్న నేనేనా
నిజమని తెలిసిన కళ్ళు మూసేనా
ఎందుకో ఏమిటో తెలియలేకున్న
ఎవరిదో మెప్పుకో… వేచి చూస్తున్నానా
రేపు పిలవదా వేచి చూడగా… నీది నీదేగా పోనే పోదుగా
నీవు కాని నువ్వు… నీలో ఉంది చూడు
తనని వదిలి చూడు… కొత్త అడుగు ఆగనందిగా
నా చిన్ని లోకమే… చేజారిపోయెనే
నా కలల వెలుగులే… అదృశ్యమాయెనే
ఈ సమయమాగునా… గాయాలు మానునా
ఈ బాధ కలుగునా… మౌనాలు పలుకునా
కన్నీళ్లు ఆగునా… ఆరాలు మోయన
సంకెళ్లు తొలుగునా… నాకు నే దొరుకునా
పదమని, వినమని… చెప్పు నువ్వైనా
తరగని, చెదరని… ముసుగు తీసేయ్ నా
యుద్ధమే లోపలే… నాకు నాతోన
ఎవరిదో ఓటమే… వేచి చుస్తున్నానా
చిన్న జీవితం… గడుపు స్వేచ్ఛగా
ఉన్న బాధని… మరువు పూర్తిగా
నీవు కాని నువ్వు… నీలో ఉంది చూడు
తనని వదిలి చూడు… కొత్త అడుగు ఆగనందిగా
నా చిన్ని లోకమే… చేజారిపోయెనే
నా కలల వెలుగులే… అదృశ్యమాయెనే
Naa Chinni Lokame song is from the Miss India movie.
Naa Chinni Lokame song was sung by Aditi, Ramya Behra & Sri Krishna.
Naa Chinni Lokame song lyrics were written by Neeraja Kona.
Naa Chinni Lokame song music was composed by Thaman S.