
| Movie Name | Janaki Ramudu (1988) |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Nagarjuna Akkineni, Vijayashanthi, Jeevitha |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Aditya Music |
ఆ ఆ తానాన తననాన… ఆ ఆఆ ఆఆ ఆ
నా గొంతు శృతిలోనా… నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ, నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ నా గొంతు శృతిలోనా
ఆ నా గుండె లయలోనా
ఒకమాట పదిమాటలై
అది పాటకావాలనీ
ఒక జన్మ పది జన్మలై
అనుబంధమవ్వాలనీ
అన్నిటా ఒక మమతే పండాలని, ఊ
అది దండలో దారమై ఉండాలని,ఊఉ
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
కడలిలో అలలుగా
కడలేని కలలుగా నిలిచి పోవాలని
పాడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
నా గొంతు శృతిలోనా… నా గుండె లయలోనా
ప్రతిరోజు నువ్వు సూర్యుడై
నన్ను నిదుర లేపాలనీ
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలనీ
కోరికే ఒక జన్మ కావాలని, ఊ
అది తీరకే మరుజన్మ రావాలని, ఊఊ
కోరికే ఒక జన్మ కావాలని, ఊ
అది తీరకే మరుజన్మ రావాలని, ఊఊ
వలపులే రెక్కలుగా
వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలనీ
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మ జన్మల
నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మజన్మల
నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
లాలాల లల లాల లా
లాలాల లల లాల లా
లాలాల లల లాల లా
లాలాల లల లాల లా
Na Gonthu Sruthilona song is from the Janaki Ramudu movie.
Na Gonthu Sruthilona song was sung by S P Balasubramanyam, Chitra.
Na Gonthu Sruthilona song lyrics were written by Acharya Athreya.
Na Gonthu Sruthilona song music was composed by KV Mahadevan.